Amazing Temples : మన దేశంలో రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. ఆధ్యాత్మికత చింతనలో మనకు ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. దేశంలో చాలా ఆలయాలు రోజు తెరుస్తుంటారు. కానీ కొన్ని ఆలయాలకు ప్రత్యేకతలు ఉంటాయి. సంత్సరానికి ఒకసారి తీసేవి కూడా ఉన్నాయి. ఈనేపత్యంలో హాసన్ కర్ణాటకలో ఓ ఆలయం సంవత్సరానికి ఒకసారి తెరుస్తారు. సంవత్సరం తరువాత కూడా ఏడాది కింద తయారు చేసిన ప్రసాదాలు చెడిపోకుండా ఉంటాయంటే ఆశ్చర్యకరమే. నిజంగా భగవత్ సంకల్పమే.
నీటితో దీపం వెలిగించే దేవాలయం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఘడియ ఘాట్ లో మాతాజీ మందిర్ అమ్మవారి ఆలయం ఉంది. కలలో ఓ పూజారికి అమ్మవారు కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించాలని చెప్పిందట. అప్పటి నుంచి ఆ ఆలయంలో నీటిత దీపం వెలిగించడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికి కూడా ఈ ఆలయంలో దీపం అలాగే వెలుగుతుండటం దైవ సంకల్పమే అనుకోవచ్చు.
తన ప్రసాదం తానే తినే స్వామి
మనం దేవుడికి నైవేద్యం పెడతాం. ప్రసాదం వడ్డిస్తాం. కానీ వాటిని తరువాత మనమే తింటుంటాం. కానీ ఇక్కడ స్వామి వారికి పెట్టిన ప్రసాదం ఆయనే తింటాడు. ఇది నిజంగా అద్భుతమే. ఇలాంటి ఎన్నో వింతలు, విశేషాలు ఉన్న దేవాలయాలు మన దేశంలో కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచిస్తుంటే నిజంగా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇలాంటి ఆలయాలు కేరళలో ఒకటి ఇంకోటి బృందావనంలో రాధాకృష్ణ శయన ఆలయం రెండు ఉన్నాయి.
పన్నెండేళ్లకోసారి..
దేశంలో పన్నెండేళ్లకోసారి తెరుచుకునే ఆలయం కూడా ఉంది. ఇది నిజంగా అత్యద్భుతమే. పుష్కరానికోసారి తెరుచుకునే ఆలయం గురించి తెలుసుకోవాలని ఉందా? తెలుసుకుంటే మనకు నిజంగా ఆశ్చర్యకరమే. దేశంలోని పలు ఆలయాల చరిత్ర తెలుసుకుంటే మనకు నిజమేనా అనిపిస్తుంది. అంతటి అద్భుతమైన విశేషాలు వాటి సొంతం. వాటి గురించి తెలుసుకుంటుంటే రోమాలు నిక్కపొడవడం ఖాయం. పన్నెండేళ్ల కోసారి పిడుగు పడి అతుక్కునే దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజిలి మహదేవ్ ప్రాంతంలో ఉందంటే అతిశయోక్తి కాదు.
సంవత్సరానికోసారి..
సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. నాగాపురంలోని వేదనారాయణ దేవాలయం, కొల్లాపూర్ లోని లక్ష్మీదేవస్థానం, బెంగుళూరులోని గవిగంగాధర్ దేవస్థానం, అరసవెల్లిలోని సూర్యనారాయణ దేవాలయం, కడప జిల్లాలోని కోదండరామాలయం.
నిరంతరం నీరు ప్రవహించే దేవాలయాలు
మహానంది, జంబకేశ్వర్, బుగ్గరామలింగేశ్వర్, కర్ణాటక కమండ గణపతి దేవాలయం, హైదరాబాద్ లోని బుగ్గ శివాలయం, బెంగుళూరులోని మల్లేశ్వర్, బెల్లంలపల్లిలోని రాజరాజేశ్వరి ఆలయం, సిద్ధగంగా దేవాలయం ప్రాంతాల్లో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది.
రంగులు మారే దేవాలయం
ఉత్తరాయణం, దక్షిణాయవనంలో రంులు మారే ఆలయం తమిళనాడులోని అతిశయ వినాయక దేవాలయం. పౌర్ణమికి తెల్లగ అమావాస్యకు నల్లగా రంగు మారే ాలయం తూర్పుగోదావరి జిల్లాలో పంచారామ సోమేశ్వరాలయం, పాపపుణ్యాలను బట్టి నీు తాకే శివగంగా ఆలయం. నెయ్యి వెన్నగా మారేది ఇక్కడే.
నిరంతరం విగ్రహాలు పెరుగుతున్న ఆలయాలు
కాణిపాకం, యాగంటి బసవన్న, కాశీ తిలదండేవ్వర్, బెంగుళూరులోని బసవేశ్వర్, బిక్కవోలు లోని లక్ష్మీగణపతి ఆలయాలు ఎప్పుడు విగ్రహాలు పెరిగే వాటిలో ఉంటాయి. ఇక్కడ విగ్రహాలు సంత్సరానికి ఇంత అని కొంచెం కొంచెం పెరుగుతున్నాయి.
పూరీలో..
పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంపై పక్షులు ఎగరవు. ఇది కూడా ఒక వింతే. గాలి కూడా వ్యతిరేక దిశలో వీస్తుంది. సముద్రం నుంచి గాలి దేవాలయం వైపు వీయాలి కానీ దానికి విరుద్ధంగా గాలి సముద్రం వైపు వీయడం ఇక్కడ ప్రత్యేకత. ఇలా వింతలు విశేషాలు ఉన్న దేవాలయాలు మనదేశంలో కోకొల్లలు. ప్రతి ఆలయానికో విశిష్టత ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Amazing features of our temples
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com