Gopichand: SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. హైదరాబాద్ శివార్లలో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుతున్నారని సమాచారం. ఎలాంటి హడావుడి లేకుండా SSMB 29 షూటింగ్ స్టార్ట్ చేశాడు రాజమౌళి. కనీసం పూజా సెరిమోని ఫోటోలు కూడా విడుదల చేయలేదు. మీడియాను ఆహ్వానించలేదు. త్వరలో ఆఫ్రికాలో చిత్రీకరణ జరపనున్నారట. SSMB 29 షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు ఇటీవల దుబాయ్ లో జరిగిన పెళ్లి వేడుకలో కూడా పాల్గొనలేదు. నమ్రత, సితార మాత్రమే వెళ్లారు.
ఇక SSMB 29లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ విశ్వసనీయ సమాచారం అందుతుంది. కాగా మెయిన్ విలన్ రోల్ కొరకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. అయితే రాజమౌళి ఆఫర్ ని గోపీచంద్ రిజెక్ట్ చేశాడట. గోపీచంద్ ఒకప్పుడు మాస్ హీరోగా బడా స్టార్స్ కి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే వరుస పరాజయాలతో ఆయన వెనుకబడ్డాడు. గోపీచంద్ కి ఆఫర్స్ తగ్గుముఖం పట్టాయి. దాంతో SSMB 29లో విలన్ రోల్ ఆఫర్ గోపీచంద్ తలుపు తిట్టిందట.
అయితే ఆయన తిరస్కరించారట. నెగిటివ్ రోల్స్ చేయను అన్నారట. ముఖ్యంగా మహేష్ బాబు వంటి స్టార్ హీరో సినిమాలో అసలు విలన్ గా కనిపించను అన్నారట. రాజమౌళి సినిమా అంటే ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకోవచ్చు. బలమైన పాత్ర దక్కుతుంది. అయినప్పటికీ నెగిటివ్ రోల్ అనే కారణంగా గోపీచంద్ చేయను అన్నాడట. ఈ వార్తలో నిజమెంతో కానీ వైరల్ అవుతుంది.
కాగా గతంలో మహేష్ బాబు మూవీలో గోపీచంద్ విలన్ రోల్ చేయడం విశేషం. దర్శకుడు తేజ జయం చిత్రంలో గోపీచంద్ కి విలన్ గా అవకాశం ఇచ్చాడు. జయం బ్లాక్ బస్టర్ కావడంతో గోపీచంద్ నటనకు కూడా మార్కులు పడ్డాయి. మహేష్ బాబుతో తేజ చేసిన నిజం మూవీలో మరోసారి గోపీచంద్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. గోపీచంద్ విలన్ గా నటించిన మరొక చిత్రం వర్షం. అనంతరం యజ్ఞం తో హీరోగా మారి స్టార్డమ్ తెచ్చుకున్నాడు. గోపీచంద్ నటించిన రణం, లక్ష్యం మంచి విజయాలు అందుకున్నాయి.