Zodiac Signs: మహాశివరాత్రి అనగానే కొందరు శివ భక్తులు పులకించి పోతారు. ఎందుకంటే ఈరోజు మహాశివుడు భక్తులకు దగ్గరగా ఉంటారని భావిస్తారు. అందువల్ల ఈరోజు శివుడికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సంవత్సరం పొడవునా చేసే పూజల కన్నా మహాశివరాత్రి రోజు శివుడికి చేసే కొన్ని కార్యక్రమాల వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే మహాశివరాత్రి సందర్భంగా కొన్ని గ్రహాల్లో మార్పులు జరగనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం పట్టనుంది. ఇంతకాలం ఈ రాశుల వారు పడిన కష్టమంతా మాయమవుతుంది. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు చూద్దాం..
మహాశివరాత్రి సందర్భంగా మేష రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయి. వీరు చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. శివుడి అనుగ్రహంతో అడ్డంకులను అధిగమిస్తారు. వ్యాపారులో కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ఉత్సాహం చూపుతారు. ఉద్యోగులకు మనశ్శాంతి లభిస్తుంది. సీనియర్ల మద్దతు ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతులు కూడా వస్తాయి.
వృషభ రాశి వారికి మహాశివరాత్రి కలిసి రానుంది. వీరు ఈ రోజున శాంతి మార్గంలో నడుస్తారు. మనసు ప్రశాంతంగా ఉండడంతో అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండడంతో వ్యాపారులు లాభాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్తగా ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు.
మహాశివరాత్రి పురస్కరించుకొని కర్కాటక రాశి వారికి సంతోషాలు వెల్లివెరిస్తాయి. మీరు ఫ్యామిలీతో ఉల్లాసంగా ఉంటారు. మంచి నిర్ణయాలను తీసుకుని ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారులు లాభాలను పొందేందుకు మంచి మార్గాలను ఎంచుకుంటారు. దీంతో కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉండడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
సింహరాశి వారికి శివరాత్రి రోజున శివుడి అనుగ్రహం లభించనుంది. రాజకీయ నాయకులకు పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అదృష్టం వల్ల పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నాయకత్వ లక్షణాలు ఉండడంతో సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వీరి నైపుణ్యంతో ఉద్యోగాల్లో రాణిస్తారు.
ధనస్సు రాశి వారికి శివరాత్రి రోజు బంగారు మయంగా మారింది. వీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తారు. ప్రశాంతంగా ఉండి దైవదర్శనాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు చేయాలనుకున్న పనులు అన్నిటినీ పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకొని అదృష్టం పట్టడం వల్ల ఊహించని దాని కంటే ఎక్కువ లాభాలు వస్తాయి.
మీన రాశి వారికి మహాశివరాత్రి కలిసి రానుంది. ఈ రాశి ఉద్యోగులు అనుకున్న సమయంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో పదోన్నతి పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం లభించడం వల్ల కొన్ని పనులు ఈజీగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. గొప్ప అవకాశాలను పొందడం వల్ల జీవితం మారిపోతుంది.