Viral Video: ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ పిల్లలు వృత్తిరీత్యా వేరే దేశాల్లో స్థిరపడతారు. కన్నవాళ్ళ దగ్గరికి రావడానికి కూడా సమయం ఉండదు. దీంతో ప్రకాష్ రాజు తన భార్యకు విడాకులు ఇస్తానని.. దానికి మీరు కచ్చితంగా రావాలని పిల్లల్ని ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగి సినిమా కథ సుఖాంతం అవుతుంది. అలాంటి సన్నివేశమే రియల్ లైఫ్ లో చోటు చేసుకుంది. కాకపోతే శతమానం భవతి సినిమా మాదిరిగానే ఇందులో మలుపులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ తండ్రి బెడ్ పై నిద్రిస్తుంటాడు. ఇంతలోనే అతని కొడుకు.. తన చేతిలో పిల్లాడితో వస్తాడు. తన తండ్రి పడుకుంటున్న బెడ్ పక్కనే ఉంటాడు. ఇంతలోనే బెడ్ మీద పడుకున్న వ్యక్తి లేస్తాడు. తన కొడుకు చేతిలో ఉన్న పిల్లాడిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురవుతాడు. అతని చేతుల్లోకి తీసుకొని ఆడిస్తాడు. తన నిద్రను కూడా పక్కనపెట్టి అతడితో ఆటలాడుతాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనంగా మారింది.
నేటి కాలంలో పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా ఆడుకోవాల్సిన సమయంలో.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ ఐదేళ్లకో, పదేళ్ళకో ఇండియాకు వచ్చి ఓ 5 లేదా 10 రోజులు గడిపి వెళ్లిపోతున్నారు.. ఇప్పుడు ఇక విదేశాలలో పరిస్థితులు బాగా లేకపోవడంతో రావడం కూడా తగ్గించేశారు. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి తన తండ్రికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి ఇలా తన కొడుకుతో కలిసి ఉన్నట్టుండి వచ్చేసాడు.. తన తండ్రి లేవకముందే ఆయన బెడ్ పక్కన నిల్చుని ఆశ్చర్యానికి గురిచేశాడు. “సంపాదన వేటలో పడి చాలామంది సొంత మనుషులకు, సొంత దేశానికి దూరమవుతున్నారు. ఇక్కడున్న వాళ్లు అక్కడి వారి పై.. అక్కడున్న వాళ్లు ఇక్కడ వారి పై బెంగ పెట్టుకుంటున్నారు. ఖండాలు దాటినా.. మనుషుల మధ్య ప్రేమ తగ్గడం లేదు..అదే భారతీయత గొప్పతనం.. మనుషుల మధ్య పెనవేసుకున్న ప్రేమ గొప్పతనం.. దాన్ని ఈ తండ్రి కొడుకులు నిరూపించారు. మూడు తరాలను ఒకే ఫ్రేమ్లో చూపించారు. ఇంతకంటే గొప్పతనం ఏముంటుంది? ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే పిల్లలు ఒక్కసారి ఆలోచించాలని.. వీలు దొరికినప్పుడల్లా తమ తల్లిదండ్రుల వద్దకు రావాలని.. అప్పుడే కుటుంబాలు బాగుంటాయని.. లేకపోతే ఇలానే ఇబ్బంది పడాల్సి ఉంటుందని ” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్న ఓ కొడుకు.. తన కొడుకుతో కలిసి ఉన్నట్టుండి ఇండియాకు వచ్చేసాడు. నేరుగా తన కొడుకును తీసుకొని తండ్రి పడుకున్న బెడ్ దగ్గరికి వెళ్ళాడు. మనవడిని చూసిన ఆ తాత ఒకసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. #family #relations #Indianculture #India pic.twitter.com/pSt8fLFlWy
— Anabothula Bhaskar (@AnabothulaB) February 24, 2025