Indraja Daughter: కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ , ప్రేక్షకుల్లో చెదరని ముద్ర వేస్తుంటారు. వాళ్లంటే ప్రేక్షకుల్లో మర్యాదతో కూడిన అభిమానం ఉంటుంది. సంసార పక్షమైన హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు వీళ్లంతా. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఇంద్రజ. ఈమె 1993 వ సంవత్సరం లో ‘ఉజ్జయిపల్లి’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈమె ఒక చిన్న క్యారెక్టర్ మాత్రమే చేసింది. ఆ తర్వాత ఈమె ‘పురుష లక్షణం’ అనే మరో తమిళ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసింది. మన టాలీవుడ్ లోకి ఈమె ‘హలో బ్రదర్’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలోని పాపులర్ సూపర్ హిట్ సాంగ్ ‘కన్నెపెట్టరో’ పాటలో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది కానీ , పెద్దగా గుర్తింపు రాలేదు.
ఆమెకు హీరోయిన్ గా మొట్టమొదటి సారి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టిన చిత్రం ‘యమలీల’. SV కృష్ణా రెడ్డి , అలీ కాంబినేషన్ లో తెరెకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఇంద్రజ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అలా గౌరవప్రదమైన పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె , పెళ్లి తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుత తరం ప్రేక్షకులకు ఈమె వెండితెర కంటే బుల్లితెర ద్వారా బాగా పరిచయం. ‘జబర్దస్త్’ తో పాటు , పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ నేటి తరం బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.
ఇక ఈమె వ్యక్తిగత విషయాలకు వస్తే, ఈమె ప్రముఖ టీవీ సీరియల్ నటుడు , వ్యాపారవేత్త మొహమ్మద్ అబ్సర్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు సరా అనే కూతురు కూడా ఉంది. రీసెంట్ గా ఆమె కూతురుకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. చూసేందుకు కుందనపు బొమ్మ లాగా ఉంది , హీరోయిన్స్ సైతం అసూయ పడే రేంజ్ లో ఉంది అంటూ సోషల్ మీడియా లో సరా ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందాన్ని పెట్టుకొని సినీ ఇండస్ట్రీ లోకి రాకపోతే , ఇండస్ట్రీ కి అన్యాయం చేసినవాళ్లు అవుతారని అంటున్నారు. కానీ సరా కి సినీ ఇండస్ట్రీ పై ఆసక్తి లేనట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి సరా ఫోటోలను కొన్ని మీకోసం కింద అందిస్తున్నాము చూడండి.