Mahesh Babu Rejected Story: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో చేయాల్సిన సినిమాని మరొక హీరోతో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమాని మరో చిన్న హీరో చేసి ప్లాప్ ను మూట గట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక సినిమా సెలక్షన్ అనేది చాలా కీలకం… ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలను కోరుకుంటున్నారు. మనం ఎలాంటి సినిమాతో ప్రేక్షకుడి మెప్పించాలి అనే విధంగా హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా కథలను ఓకే చేసిన కూడా చాలా ప్రాబ్లం ను మూట గట్టుకోవచ్చు కొన్ని మంచి కథలను వదిలేసిన కూడా ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు గొప్ప విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం గుణ శేఖర్ రాసుకున్న ఒక కథని అల్లు అర్జున్ తో చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘వరుడు’ సినిమా కావడం విశేషం…
గుణ శేఖర్ ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా ఓవర్ హైప్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు హీరోయిన్ ఎవరు అనేది ఎవరికి తెలియకుండా ఆమెను హోల్డ్ చేసి పెట్టి డైరెక్ట్ గా స్క్రీన్ మీదనే చూపించాడు. దానివల్ల సినిమాకి భారీగా మైనస్ అయింది. ఆ హీరోయిన్ ప్రేక్షకుడి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే విధంగా లేదు.
దాంతో పాటుగా సినిమాలో కథ ఎటు వెళ్తుంది. దాని వల్ల కూడా ప్రేక్షకుడు సినిమా నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు… మొత్తానికైతే సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక మహేష్ బాబు ఈ సినిమాను వదులుకొని మంచి పని చేశారంటు చాలామంది సినిమా మేధావులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు… మహేష్ బాబు గుణశేఖర్ కాంబోలో అప్పటికే మూడు సినిమాలు వచ్చాయి… ఒక్కడు, అర్జున్, సైనికుడు ఇలా మూడు సినిమాలతో మహేష్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశాడు…