Toxic Movie Teaser Review: ‘ కన్నడ సూపర్ స్టార్ ‘యాష్'(Rocking Star Yash) నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్ ‘(Toxic Movie) వచ్చే నెల 19 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా, నేడు ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రేంజ్ యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేయడం తో యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే యూట్యూబ్ లో ఆ గ్లింప్స్ వీడియో కి దాదాపుగా 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అన్ని భాషలకు కలిపి ఒకే గ్లింప్స్ లాగా గతం లో విడుదల చేశారు. కానీ నేడు విడుదల చేసిన టీజర్ మాత్రం అన్ని భాషలకు ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ టీజర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
కానీ మొదటి గ్లింప్స్ వీడియోకి వచ్చినంత రెస్పాన్స్ మాత్రం ఈ గ్లింప్స్ కి రాలేదు. గ్లింప్స్ వీడియో కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ లో ఉన్నింది. అయితే ఈ టీజర్ లో ఒక మనిషిని ఎన్ని విధాలుగా చంపొచ్చు అనేది చూపించారు. ఈ సినిమాలో వయొలెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ టీజర్ ద్వారా ఒక శాంపిల్ మాత్రమే చూపించారు మేకర్స్. టీజర్ ప్రారంభంలో ‘ఈసారి యుద్ధం వేరు..వాళ్ళ కుతంత్రాలు వేరు..అందరితో విరోధం పెట్టుకొని బ్రతకలేవు, పట్టుదల వదిలేయ్, గివ్ అప్ రాయా, ఇట్స్ ఓవర్’ అని వాయిస్ ఓవర్ వస్తుంది. హీరో యాష్ కూడా ‘ఇట్స్ ఓవర్..కానీ నేను చెప్పినప్పుడే ఇట్స్ ఓవర్’ అనే డైలాగ్ రావడం చాలా బాగా అనిపించింది. ఆయన క్యారెక్టరైజేషన్ KGF సిరీస్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉందని ఈ టీజర్ ని చూస్తే తెలుస్తోంది.
కానీ KGF లో ఏ నెగటివ్ హీరోయిజం అయితే యాష్ చూపించాడో, ఈ సినిమాలో కూడా అదే నెగటివ్ హీరోయిజాన్ని చూపించినట్టుగా అనిపించింది. KGF యాష్ కి, టాక్సిక్ లో ఉన్న యాష్ కి ఎలాంటి తేడా కనిపించడం లేదంటూ టీజర్ ని చూసిన వాళ్ళు అంటున్నారు. ఇక ఈ టీజర్ లోని యాక్షన్ సన్నివేశాలు, ఇప్పటి వరకు ఇండియా లో ఏ డైరెక్టర్ తీయని విధంగా తీసారని అంటున్నారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ అనే మహిళ దర్శకత్వం వహించింది. కానీ గ్లింప్స్ వీడియో, టీజర్ ని చూసిన తర్వాత అసలు ఈ చిత్రానికి నిజంగా అమ్మాయే దర్శకత్వం వహించిందా, మగవాళ్లకు కూడా ఇంత వయొలెంట్ ఆలోచనలు రావు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి.