Hair Loss: మనిషిలోని ప్రతి అవయవం సక్రమంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు. అలాగే అన్ని రకాల అవయవాలు బాగున్నప్పుడే అందంగా కనిపిస్తారు. కానీ కొందరికి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడంతో బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ కాలుష్యం తో పాటు ప్రోటీన్ల లోపం వల్ల జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. అయితే ప్రోటీన్ల లోపాల నివారణకు ముందు నుంచే కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. వాటిలో గుమ్మడి గింజలు ఒకటి. గుమ్మడి గింజల్లో ఉండే ప్రోటీన్ల వల్ల చుట్టూ రాలే సమస్యను అరికడుతుంది. మరి వీటిని ఎలా ఉపయోగించాలి అంటే..?
గుమ్మడి కాయలు చూస్తే ఎవరు తినరు. వీటిలో ఒక రకమైన గుమ్మడికాయలు దిష్టి తీయడానికి మాత్రమే పనికి వస్తాయి. మరో రకమైన గుమ్మడికాయలను కొందరు మాత్రమే ఆహార పదార్థాలు వాడతారు. అయితే గుమ్మడి కాయలు ఉండే గింజల వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడి గింజల్లో బీటా సిటోస్టెరాల్, ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు సమ్మేళనాలు టెస్టోస్టెరాన్ ను dht గా మార్చే ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ ను నిరోధించడంలో సహాయపడుతూ ఉంటాయని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి. 2014 సంవత్సరంలో జరిపిన ఒక అధ్యయనంలో గుమ్మడి గింజల నూనెను తీసుకున్న పురుషులలో ప్లేసిబో తీసుకున్న వారితో పోలిస్తే జుట్టు పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
గుమ్మడి గింజలలో జింకు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కణాల పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. సాధారణంగా జింకు లోపం ఉన్నవారిలో జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే గుమ్మడి గింజల నువ్వు నేను తలపై రాస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఉమ్మడి గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్త ప్రసరణకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
అయితే జుట్టు రాలకుండా ఉండడానికి గుమ్మడి గింజలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు 28 గ్రాముల లేదా ఒక గుప్పెడు వేయించిన గింజలను స్నాక్స్ గా తీసుకోవచ్చు. వీటిని సలాడ్,, ఓట్స్ లలో వాడుకోవచ్చు. అలాగే గుమ్మడి గింజల నూనె క్యాప్సూల్స్ రోజుకు ఒక చెంచా తీసుకోవచ్చు. గుమ్మడి గింజలను కొద్దిగా వేడి చేసి ఇందులో ఆయిల్ వేసి.. ఈ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు పోసిన అందించిన వారవుతారు. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అయితే గుమ్మడి గింజలతో జుట్టు రాళ్ల దాన్ని అరికట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే గుమ్మడి గింజల తో ప్రభావం కొన్ని వారాలు పట్టవచ్చు. అందువల్ల కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత వాటి ఫలితం పై నిర్ణయం తీసుకోవాలి.