Money Earning Technique: కొందరు జీవితంలో అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. అయితే దీనిని కూడా పెట్టుకోవడంలో.. దాచుకోవడంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. ఇదే సమయంలో వీరు ఇంట్లో దాచుకున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్తూ ఉంటారు. ఆ తర్వాత డబ్బు పోయిన తర్వాత తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. మళ్లీ డబ్బు ఎలా సంపాదించుకోవాలి? అని మదన పడుతూ ఉంటారు. అయితే ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉన్నా.. డబ్బులు సంపాదించవచ్చు. అదేంటంటే?
ఒకరు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించవచ్చు. ఇలా కొన్నాళ్లపాటు సంపాదించిన డబ్బు ఇంట్లో దాచుకున్న తర్వాత దానిని దొంగలు ఎత్తుకెళ్లవచ్చు. అంతేకాకుండా దురదృష్టవశాత్తు చేస్తున్న జాబ్ ఒక్కసారిగా ఊడిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డబ్బు సంపాదించాలంటే ఎలాంటి ఆలోచన తోయదు.
అలాగే వ్యాపారం చేసేవారు కూడా కొన్నాళ్లపాటు డబ్బు సంపాదించిన తర్వాత నష్టాలు రావచ్చు. ఇలా నష్టాలు వచ్చిన తర్వాత డబ్బా అంతా పోయి చేతిలో ఏమీ ఉండలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో కూడా డబ్బు ఎలా సంపాదించాలని ఆందోళన పడతారు.
అయితే ఒక వ్యక్తికి వస్తువులు, డబ్బు, ఆభరణాలు ఎప్పుడైనా రావచ్చు.. అవి ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు. కానీ మనిషికి ఉండే తెలివి, జ్ఞానం, ఆలోచన ఎప్పుడూ అతనితోనే ఉంటాయి. అలాగే ఎలా డబ్బు సంపాదించాలి అనే చిన్న టెక్నిక్ తెలిస్తే అతను ఎక్కడ ఉన్నా.. ఎప్పుడైనా డబ్బు సంపాదించవచ్చు. అయితే ఈ టెక్నిక్ కష్ట రూపంలో ఉండవచ్చు.. తెలివి రూపంలో ఉండవచ్చు. ఇలా ఎటువంటి పరిస్థితిలోనైనా డబ్బు సంపాదించే నైపుణ్యం ఉన్న వారిని కొందరు ‘ బతుకుదెరువు నేర్చినోడు ‘అని అంటారు. అంటే ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఎలాంటి అవకాశం లేనప్పుడు అవసరమనుకుంటే చిన్న బండి పెట్టి బఠానీలు కూడా అమ్ముకునేందుకు సిద్ధపడతాడు. ఒకప్పుడు పెద్దపెద్ద వ్యాపారాలు చేసేవారు సైతం పరిస్థితి బాగా లేనప్పుడు చిన్న వ్యాపారం కూడా చేయవచ్చు. అంటే డబ్బు సంపాదించడానికి హోదా, పలుకుబడి అవసరం లేదు. నైపుణ్యం, కష్టపడే తత్వం ఉంటే చాలు అని అర్థమవుతుంది.
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి విషయంలోనూ డబ్బు అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి డబ్బులు వృధా చేయడం వల్ల తిరిగి సొంతం చేసుకోవడానికి కష్టమవుతుంది. అందువల్ల ముందు జాగ్రత్త కొద్దిగా డబ్బులు కాపాడుకుంటూ ఉండాలి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ఈ డబ్బు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. అయితే సంతోషం కోసం కొంతవరకు డబ్బులు నియమించుకోవాలి. అలా వచ్చిన ఆదాయంలో కొంతవరకు మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకానీ సంపాదించిన మొత్తం జల్సాలు, ఇతర ఖర్చులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
అయితే ఎంత తెలివి ఉన్న కూడా ఒక్కోసారి పరిస్థితులు బాగా లేకపోతే తిరిగి డబ్బు సంపాదించడం కష్టమే అవుతుంది. అందువల్ల డబ్బు విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.