Today 6 September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. శనివారం ద్వాదశరాసులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఇతరులకు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారితో సంయమనం పాటించాలి. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అధికారుల మద్దతు కూడా అవసరం. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు కుటుంబ సభ్యులతో గొడవలకు దిగదు. పెద్దల సలహా ఉంటే లాభాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏవైనా అనారోగ్యాలు ఉంటే వెంటనే ఆస్పత్రిలోకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . వ్యాపారులు కొత్తవారిని తమ భాగస్వామ్యంలో చేర్చుకుంటారు. అయితే ఇలాంటి వారితో అప్పుడే సొంత విషయాలను చెప్పకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఖర్చులు ఉంటాయి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆచీ చూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులు ఈరోజు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి సమయంలో పెద్దలు లేదా కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు గతంలో చేపట్టిన కొన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఈరోజు శుభవార్త అందే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈరోజు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఒక ప్రాజెక్టు కోసం ఉద్యోగులు వేచి చూస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొందరు బంధువులు డబ్బు విషయంలో మోసం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు అధికారుల మద్దతుతో కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. అనుకోకుండా ఓ శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల గురువుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఏ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల్లో గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉండే బంధువులను వచ్చి శుభవార్తను అందుతాయి. ఉద్యోగం కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పై చదువుల కోసం ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే సమస్యలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. బడ్జెట్కు అనుగుణంగా ఖర్చులను చేయాలి. లేకుంటే తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గతంలో ఉన్న ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల మద్దతు ఉండటంతో వ్యాపారులకు లాభాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో సంతోషంగా గడుపుతారు. వీరికి తోటి వారి మద్దతు ఎక్కువగా ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉండడంతో వీరి ఆనందానికి అడ్డు ఉండదు. మెరుగైన ఆరోగ్యం కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులకు సౌకర్యాలు ఉండడంతో పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉన్నత విద్య కోసం కొందరు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఊహించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంట్లో అవసరాలు తీరడానికి అప్పులు చేస్తారు. ఎవరైనా డబ్బు అడిగితే ఇచ్చే ప్రయత్నాలు అసలు చేయొద్దు. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పెద్దల సలహాలు పాటించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . గతంలో వ్యాపారాలు చేసిన ప్రయాణాలు విజయవంతం అవుతాయి. వీరికి కొత్తగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడితే దీనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు కష్టపడి పని చేసిన దానికి ఫలితం ఉంటుంది. అయితే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తే మౌనంగా ఉండటమే మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.