Child Food: ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం తీసుకుంటున్నాము కదా.. అని కొందరు అనుకుంటారు. కానీ అందులో ఎంత ప్రోటీన్ ఉంది? అవి ఎలాంటి పోషకాహారాలు? అన్న ఫస్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ఆహారం తీసుకున్నా.. అందులో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటే నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల కోసం ఈ 4 రకాల ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల వారు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వారిలో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మరి ఎలాంటి ఆహారం పిల్లలకు ఇవ్వాలి? వాటిలో ఏ రకమైన ప్రోటీన్లు ఉంటాయి?
గుడ్డు:
గుడ్డులో ప్రోటీన్లతో పాటు బి12 విటమిన్ ఉంటుంది. ఇది మెదడు వికాసానికి. ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తెలిపిన ప్రకారం పిల్లలకు ప్రతిరోజు గుడ్డు పెట్టడం వల్ల మెదడు శక్తి పెరుగుతుంది. అయితే ఈ గుడ్డు బాయ్ ఉండాలి. అప్పుడప్పుడు మాత్రమే ఆమ్లెట్ వేయిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఆమ్లెట్ వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వచ్చు.
పాలకూర:
మార్కెట్లో పాలకూర విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీనిని ఎవరూ పట్టించుకోరు. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో కాల్షియం, విటమిన్ ఏ ఉంటుంది. ఇవి రక్తం తక్కువగా ఉన్నవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే కంటిచూపు కూడా మెరుగుపరుస్తుంది. దీనితో ఎముకలు కూడా బలపడతాయి. ప్రతిరోజు కూరగా లేదా స్మూతీలా దీనిని ఉపయోగిస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
బాదం:
ప్రతిరోజు నాలుగు లేదా ఐదు నానబెట్టిన బాదం పలుకులు ఇవ్వడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పాదంలో విటమిన్ ఈ, మెగ్నీషియం అనే ఖనిజం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. నానబెట్టిన బాదం పలుకులు తినడానికి ఇష్టం లేకపోతే బాదం పౌడర్లు తయారు చేసి ప్రతిరోజు పాలలో కలుపుకోవచ్చు.
పెరుగు:
పెదిగే పిల్లల కోసం ప్రతిరోజు పెరుగు ఇవ్వడం వల్ల ఎంతో ఆరోగ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ పెంపొందుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి రోగాలు తరిచేరకుండా కాపాడుతుంది.
ఇవి పిల్లలకు పెట్టడం మాత్రమే కాకుండా పెద్దవారు కూడా ప్రతిరోజు తినే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్యం దరిచేరదు. ప్రతిరోజు లేదా వీకెండ్ లో ఫాస్ట్ ఫుడ్, రోస్ట్ ఫుడ్ కు పెట్టే ఖర్చులు దీనికి ఉపయోగించడం వల్ల నిత్యం ఆరోగ్యంగా ఉండిపోతారు. ఈ పదార్థాల్లో నిజమైన ప్రోటీన్లు ఉంటాయి.