Health Tips: కొందరికి డబ్బు అంటే మహా ఇష్టం. మిగతా వారి కంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారు నిద్ర ఆహారాలు మానేస్తారు. ఏమాత్రం తీరికలేకుండా పనిచేస్తారు. కొందరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. మార్కెట్లోకి ఏ కొత్త ఐటమ్ వచ్చిన వెంటనే దాని రుచి చూడాలని అనుకుంటారు. ఈ క్రమంలో దానికి ఎంత ఖర్చయినా వెనకాడకుండా తినేస్తారు. మరికొందరు తాము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో నిద్రను దూరం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎవరికివారు అనుకున్నది సాధించడానికి మిగతా విషయాలపై నిర్లక్ష్యం చేస్తారు. డబ్బు సంపాదిస్తేనే జీవితం గొప్ప అని కొందరు అనుకుంటే.. అనుకున్న ఆహారం తినాలని మరికొందరు అనుకుంటారు.. ఇంకొందరు మాత్రం ఒక లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మిగతావి ఏవి పట్టించుకోరు.. అసలు వీటిలో ఏది కరెక్ట్? ఏమి అసలైన సంపదలు?
ఇటీవల కొందరు పెద్దమనుషులు చెబుతూ.. 70 ఏళ్ల తర్వాత ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో.. వారు జీవితాన్ని గెలిచినట్లు అని అంటున్నారు. అంటే జీవితాంతం వారు డబ్బు సంపాదించ లేదా అంటే.. ఎంతో కొంత సంపాదిస్తారు. కానీ అన్నింటికి మించి వారు ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే జీవితాంతం సరైన ఆహారం తీసుకుంటూ.. అనుకున్న పనిని సక్రమంగా పూర్తి చేసిన వారు 70 ఏళ్ల తర్వాత కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా ఆరోగ్యంగా ఉండడానికి జీవితాంతం ఏం చేయాలి?
సాత్విక ఆహారం:
ఆహారం లేకపోతే మనిషి బతకడం కష్టం. అయితే ప్రస్తుత రోజుల్లో అత్యంత రుచికరమైన ఆహార పదార్థాలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఇది ఎంత టేస్టీగా ఉంటాయో.. అంతే ప్రమాదాలను తీసుకొస్తాయి. ఇలాంటి సమయంలో సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. అలా అని ఎలాంటి టెస్ట్ లేని ఆహారాన్ని తీసుకోవడం కాదు. వారంలో ఒకసారి లేదా సందర్భం వచ్చినప్పుడు రుచికరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా మాత్రం సాత్విక ఆహారం తీసుకుంటే శరీరానికి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
నిద్ర:
ప్రతి వ్యక్తికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. ప్రతి ఒక్కరూ సరైన నిద్ర పోకపోతే శరీరంలో అనేక మార్పులను చూడాల్సి వస్తుంది. నిద్ర అనుకున్న విధంగా లేకపోతే మానసికంగా ఆందోళన ఉంటుంది. దీంతో రోజు చేసే పనిని సక్రమంగా నివర్తించలేరు. అంతేకాకుండా నిద్ర సరిగా లేకపోవడం వల్ల సరైన ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మానసిక ప్రశాంతత:
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఒత్తిడిలు ఉంటాయి. అయితే కోరికలు ఎక్కువగా ఉంటేనే ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి ఒత్తిడి ఉండకూడదు అనుకుంటే కోరికలను తగ్గించుకోవాలి. సామర్థ్యానికి మించి పనులు చేయకూడదు. అలాంటప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇలా ప్రశాంతంగా ఉన్న వారిలో ఎలాంటి అనారోగ్యం దరిచేరదు.
ఈ విధంగా ప్రతి వ్యక్తికి సాత్విక ఆహారం, కంటి నిండా నిద్ర, మానసిక ప్రశాంతత ఉంటే ఆ వ్యక్తి 70 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.