Bigg Boss 9 Telugu : ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) మరో రెండు రోజుల్లో స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ పై ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం ‘అగ్ని పరీక్ష’ షో. మొట్టమొదటిసారి సామాన్యులకు బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం కల్పిస్తూ, కొన్ని వేల అప్లికేషన్స్ నుండి కేవలం 13 మందిని మాత్రమే ఎంచుకొని, ఆ 13 మందిలో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ముగ్గురిని, జడ్జీల సెలక్షన్ ద్వారా మరో ముగ్గురిని బిగ్ బాస్ 9 లోకి పంపబోతున్నారు. మరి ఈ ఆరు మంది ఎవరు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టీం ప్రేక్షకులకు ఎవ్వరూ ఊహించని రేంజ్ ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘అగ్ని పరీక్ష’ షో కి జడ్జీలుగా బిందు మాధవి, అభిజిత్ మరియు నవదీప్ వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు నిర్ణయాలపై ప్రారంభం లో ఆడియన్స్ నుండి కాస్త వ్యతిరేకత వచ్చిన విషయం వాస్తవమే కానీ, ఎపిసోడ్స్ గడిచే కొద్దీ వీళ్ళు సరైన కంటెస్టెంట్స్ ని ఎంచుకున్నారు అనే అభిప్రాయాన్ని జనాల్లో నాటడం లో సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏమిటంటే ఈ ముగ్గురు జడ్జిలలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నారని టాక్. ట్విస్ట్ అదిరిపోయింది కదూ. ఎవరైతే వాళ్ళ చేతుల మీదుగా సామాన్యులను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపారో, ఇప్పుడు వాళ్ళే సామాన్యులతో కలిసి బిగ్ బాస్ లో ఆడబోతున్నారు. అయితే వీళ్ళు తాత్కాలిక కంటెస్టెంట్స్ నా?, లేకపోతే షో చివరి వరకు ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సీజన్ లో చీఫ్ గెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందట. అంటే ఇప్పుడు మన ఇంటికి ఎప్పుడో ఒకసారి విశిష్ట అతిథి వచ్చి కొన్ని రోజులు గడిపి పోతారు కదా, అలా అన్నమాట. ముందుగా ఈ పల్లవి ప్రశాంత్ మరియు ఫైమా పేర్లను అనుకున్నారు. కానీ చివరికి ‘అగ్నిపరీక్ష’ షోలోని ఒక జడ్జి ని కొన్ని రోజులు హౌస్ లోకి పంపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటి వరకు ఏ భాషలో కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారి మన తెలుగు బిగ్ బాస్ లోనే ఇలాంటి ఆలోచన చేశారు. మరి ఉన్న ముగ్గురు జడ్జిలలో ఎవరు హౌస్ లోకి వెళ్ళబోతున్నారు అనే సందేహం మీ అందరిలో ఉండే ఉంటుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బిందు మాధవి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. త్వరలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.