https://oktelugu.com/

Costly chicken : వెరీ కాస్ట్లీ చికెన్.. వీటి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

కొన్ని ప్రదేశాల్లో చికెన్ ధర అయితే ఏకంగా లక్షల్లో ఉంటుంది. వీటిని చూసి వీళ్లు చికెన్ అమ్ముతున్నారా? లేకపోతే బంగారం అమ్ముతున్నారా? అనే సందేహం వస్తుంది. అసలు ఎక్కడ చికెన్ ధరలు ఇంత ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. వీటిని ఖరీదు ఎలా ఉంటాయి. ఎక్కువ రేటు ఉన్నా కూడా వీటిని ఎవరైనా కొంటారా? అనే పూర్తి విషయాలు ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 02:03 AM IST

    Most Expensive Chicken Breeds

    Follow us on

    Costly chicken :  నాన్ వెజ్ లేకపోతే కొందరికి ముద్ద కూడా దిగదు. రోజూ నాన్ వెజ్ పెట్టిన తింటారు. అయితే చికెన్ ధర కూడా సాధారణంగానే ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఇందులో మార్పులు ఉంటాయి. సాధారణంగా రూ.150 నుంచి రూ.250 వరకు చికెన్ ధరలు మార్కెట్లో నిర్ణయిస్తారు. ఇది సీజన్ బట్టి మారుతుంటుంది. కానీ కొన్ని దేశాల్లో చికెన్ తినాలంటే ఆస్తులు ఆమ్ముకోవాల్సిందే. ఎందుకంటే ఆ కోడి చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిదట. అందుకే వాటి చికెన్ ధరలు వెరీ కాస్ట్లీ. మరి ఎంత చికెన్ ధర పెరిగిన కూడా కేజీ రూ.500కు మించి ఉండదు. అలాంటిది కొన్ని ప్రదేశాల్లో చికెన్ ధర అయితే ఏకంగా లక్షల్లో ఉంటుంది. వీటిని చూసి వీళ్లు చికెన్ అమ్ముతున్నారా? లేకపోతే బంగారం అమ్ముతున్నారా? అనే సందేహం వస్తుంది. అసలు ఎక్కడ చికెన్ ధరలు ఇంత ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. వీటిని ఖరీదు ఎలా ఉంటాయి. ఎక్కువ రేటు ఉన్నా కూడా వీటిని ఎవరైనా కొంటారా? అనే పూర్తి విషయాలు ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

    అయామ్ సెమని
    ఇండోనేషియాలో ఉండే ఈ అయామ్ సెమని కోడి చాలా ఖరీదైనది. ఈ దేశంలో మాత్రమే ఈ కోడి మాంసం లభిస్తుంది. దీని మాంసం, రక్తం అన్ని కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఈ కోడిని చాలా పవిత్రమైన కోడిగా నమ్ముతారు. అయితే ఈ కోడి కేజీ విలువ మార్కెట్లో దాదాపుగా రూ.2 లక్షలు ఉంటుంది. అన్ని కోళ్లలో ఈ కోడి విలువే ఎక్కువగా ఉంటుంది.

    డాంగ్ టావో
    వియత్నాం దేశంలో డాంగ్ టావో అనే కోడి చాలా ఫేమస్. ఈ కోడి పాదాలు కాస్త లావుగా ఉంటాయి. అక్కడ రెస్టారెంట్లలో ఈ కోడి మాంసం చాలా ఖరీదు అయి ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఎవరైనా ఇంటికి వెళ్తే ఈ కోడి మాంసాన్ని స్పెషల్ భోజనంగా పరిగణిస్తారట. వాళ్లు జీవితంలో ఒక్కసారైన ఈ మాంసం తినకపోతే తప్పుగా భావిస్తారట. ఈ దేశంలో ఉండే ప్రజలు తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఈ కోడి మాంసాన్ని తింటారు. ఈ డాంగ్ టావో కోడి కిలో మాంసం దాదాపుగా రూ.1,50,000 వరకు ఉంటుందట. సీజన్ బట్టి దీని ధరల్లో కూడా మార్పులు ఉంటాయి.

    సెరమా
    ఈ సెరమా జాతి కోళ్లు మలేషియన్‌లో కాస్త అరుదుగా కనిపిస్తాయి. ఈ కోళ్లు చూడటానికి చాలా చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. వీటి బరువు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అయిన ఈ కోళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సెరమా కోళ్ల ధర కిలో దాదాపుగా రూ.85,000 వరకు ఉంటుంది.

    సిల్కీ
    చైనాకు చెందిన అరుదైన జాతి కోడి సిల్కీ రెక్కలకు చాలా ఫేమస్. దీని రెక్కలు చాలా మృదువుగా ఉంటాయి. వీటి చర్మం, ఎముకలు నీలి రంగులో ఉండటంతో ఈ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోళ్ల మాంసం ధర కిలో దాదాపుగా రూ.50,000 వేలు ఉంటుంది.

    ఒనగడోరి
    జపాన్‌కు చెందిన అరుదైన కోడి జాతి ధర దాదాపుగా రూ.2 లక్షలు ఉంటుంది. ఈ కోడి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ కోడిని కొందరు లక్కీగా భావిస్తారు. అందుకే ఈ కోడి ధర కూడా ఎక్కువగా పలుకుతోంది. దీని ధర దాదాపుగా రూ.2 లక్షలు ఉంటుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.