Homeఅంతర్జాతీయంIndia UK Trade Deal: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

India UK Trade Deal: భారత్‌ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్‌ డీల్‌.. అమెరికాకు షాక్‌!

India UK Trade Deal: అగ్రిమెంట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఏకు మేకయ్యే ప్రమాదమే ఎక్కుగా కనిపిస్తోంది. తాజాగా భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం ఒకవైపు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ, అమెరికా కోసం భారత్‌ తన ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు నిరాకరిస్తోంది. ఈ క్రమంలో యూకేతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని ట్రంప్‌కు షాక్‌ ఇచ్చింది.

మూడేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) మధ్య చారిత్రక ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం లండన్‌లో కాకుండా యూకేలోని చారిత్రక పట్టణం చెక్వర్స్‌లో జరిగిన సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌లు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో మానవ తయారీ వస్తువులకు డిమాండ్‌ పెరగనుంది, అదే సమయంలో యూకే వస్తువుల ధరలు తగ్గనున్నాయి, ఇది రెండు దేశాల ప్రజలకు లాభదాయకం. బ్రెగ్జిట్‌ తర్వాత బ్రిక్స్‌ నుంచి బయటకు వచ్చిన యూకేకు ఈ ఒప్పందం వాణిజ్య బలోపేతానికి కీలకం. భారత్‌ ఈ ఒప్పందం ద్వారా తన ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకుంటూ అమెరికాకు వ్యూహాత్మకంగా సవాల్‌ విసిరింది.

Also Read: భారత్‌పై చైనా వాటర్‌ బాంబ్‌.. జలయుద్ధం తప్పదా?

శివాలయం కోసం కొట్టుకుంటున్న థాయ్‌లాండ్‌–కంబోడియా..
ఇదిలా ఉంటే.. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య శివాలయం (ప్రెహ్‌ విహెర్‌) చుట్టూ కొనసాగుతున్న భూభాగ వివాదం ఇటీవల సైనిక ఘర్షణలకు దారితీసింది. ఈ ప్రాంతంపై రెండు దేశాలు చారిత్రక హక్కులను ప్రకటిస్తున్నాయి. థాయ్‌లాండ్‌ సైనిక బలంలో బలమైన దేశంగా ఉన్నప్పటికీ, చైనా మద్దతుతో కంబోడియా దూకుడుగా వ్యవహరిస్తోంది. అమెరికా థాయ్‌లాండ్‌కు మద్దతు ఇస్తుండగా, చైనా కంబోడియాకు సైనిక, ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఘర్షణ ఆసియా ప్రాంతంలో శక్తి సమతుల్యతను ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారత్‌ ఈ సంఘర్షణలో తటస్థ వైఖరిని కొనసాగిస్తూ, ప్రాంతీయ స్థిరత్వంపై దృష్టి సారించింది.

భారత్‌తో చైనా దోస్తీ..
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. భారత్‌తో చైనా దోస్తీకి ప్రయత్నిస్తోంది. 2025 జనవరి నుంచి భారత్‌–చైనా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, చైనా భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోంది. 2020 గాల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. భారత్‌ చైనా పర్యాటకులకు వీసాలను పునరుద్ధరించడం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించడం వంటి చర్యలు ఈ మెరుగుదలకు సూచికలు. అమెరికా ఆర్థిక విధానాలు, ముఖ్యంగా చైనాపై విధించిన సుంకాలు, భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంచేందుకు చైనాను ప్రేరేపించాయి. చైనా, రష్యా, భారత్‌ మధ్య త్రైపాక్షిక సహకారం బలోపేతం కావడంతో అమెరికా ఆధిపత్యానికి సవాల్‌ ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read:  చైనా దెబ్బకు నిలిచిపోనున్న కేంద్ర ప్రభుత్వ పథకం

ఈ చర్యలన్నీ భారత్‌ యొక్క బహుముఖ దౌత్య విధానాన్ని, ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ శక్తిని పెంచడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారత్‌ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular