World War 3 Latest News 2025: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్, ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా, భారత్–పాకిస్థాన్, థాయ్‌లాండ్–కొలంబియా తదితర దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. వీటితోపాటు మొన్నటి వరకు హమాస్, సిరియా కూడా యుద్ధంతో నష్టపోయాయి. ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే చాలా దేశాలు నష్టపోతాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సేఫ్‌గా ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్–ఇజ్రాయెల్ లాంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ అస్థిరతలు మూడవ ప్రపంచ యుద్ధ భయాలను రేకెత్తిస్తున్నాయి. అటువంటి దుర్భర పరిస్థితుల్లో, కొన్ని దేశాలు తమ భౌగోళిక, రాజకీయ, సామాజిక స్థితిగతుల కారణంగా సురక్షిత ఆశ్రయంగా నిలుస్తాయి.
1. అంటార్కిటికా..
అంటార్కిటికా, భౌగోళికంగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చాలా దూరంలో ఉండటం వల్ల అణు యుద్ధం వంటి విపత్తుల నుంచి సురక్షతంగా ఉంటుంది. 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, ఈ ప్రాంతం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. అయితే, మంచుతో కప్పబడిన వాతావరణం, తీవ్రమైన చలి మనుగడకు పెద్ద సవాలుగా నిలుస్తాయి. రాజకీయంగా ఎలాంటి సంఘర్షణలకు తావులేని ఈ ప్రాంతం, యుద్ధ సమయంలో అత్యంత సురక్షితమైన ఎంపికగా కనిపిస్తుంది.
2. ఐస్‌లాండ్..
గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచే ఐస్‌లాండ్, శాంతియుత దేశంగా ప్రసిద్ధి. ఈ దేశం ఎప్పుడూ పూర్తి స్థాయి యుద్ధంలో పాల్గొనలేదు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఒంటరిగా ఉండే ఈ ద్వీప దేశం, భౌగోళికంగా యుద్ధ సంఘర్షణలకు దూరంగా ఉంటుంది. అయితే, అణు యుద్ధం నుండి పూర్తి రక్షణ కల్పించే సామర్థ్యం ఈ దేశానికి లేదు, కానీ రాజకీయ స్థిరత్వం, తక్కువ జనాభా దీన్ని సురక్షిత ఎంపికగా చేస్తాయి.
3. న్యూజిలాండ్..
న్యూజిలాండ్, గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో రెండో స్థానంలో ఉంది. దీని తటస్థ విదేశాంగ విధానం, పర్వత భూభాగాలు యుద్ధ సమయంలో రక్షణ కల్పిస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఒంటరిగా ఉండే ఈ దేశం, ఆర్థికంగా స్థిరంగా, స్వయం సమృద్ధిగా ఉంటుంది. వ్యవసాయం, సహజ వనరులు యుద్ధ కాలంలో ఆహార భద్రతను అందిస్తాయి.
Also Read: India Vs Pakistan: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేను అప్రమత్తం చేసిన పాకిస్థాన్!
4. స్విట్జర్లాండ్..
స్విట్జర్లాండ్ రెండో ప్రపంచ యుద్ధంలో తటస్థ వైఖరిని అనుసరించిన చరిత్ర కలిగిన దేశం. ఆల్ప్‌స్ పర్వతాలు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. రాజకీయంగా తటస్థత, బలమైన ఆర్థిక వ్యవస్థ, అణు ఆశ్రయాల వంటి సౌకర్యాలు ఈ దేశాన్ని యుద్ధ సమయంలో సురక్షితంగా చేస్తాయి. అంతేకాక, అంతర్జాతీయ సంస్థలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఈ దేశం దాడులకు గురయ్యే అవకాశం తక్కువ.
5. గ్రీన్‌లాండ్..
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా పేరొందిన గ్రీన్‌లాండ్, కేవలం 56,000 మంది జనాభాతో రాజకీయ, సైనిక సంఘర్షణలకు దూరంగా ఉంటుంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే ఈ దేశం, భౌగోళికంగా ఒంటరిగా ఉండటం, తటస్థ వైఖరి కారణంగా యుద్ధ భయాల నుండి రక్షణ కల్పిస్తుంది. అయితే, తీవ్రమైన వాతావరణం ఇక్కడి సవాలు.
6. ఇండోనేషియా..
ఇండోనేషియా, తన స్వతంత్ర విదేశాంగ విధానంతో ప్రపంచ శాంతికి ప్రాధాన్యత ఇస్తుంది. దీని భౌగోళిక స్థానం, ద్వీపసమూహ రూపం యుద్ధ సంఘర్షణలకు దూరంగా ఉంచుతాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఈ దేశం రాజకీయంగా తటస్థంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది.
7. తువాలు..
11 వేల మంది జనాభాతో ఉన్న తువాలు, పసిఫిక్ మహాసముద్రంలో చిన్న ద్వీప దేశం. రాజకీయ సంఘర్షణలకు దూరంగా, సైనిక శక్తి లేని ఈ దేశం యుద్ధ పరిస్థితుల్లో దాడుల లక్ష్యంగా మారే అవకాశం లేదు. అయితే, పరిమిత వనరులు, మౌలిక సదుపాయాలు మనుగడకు అడ్డంకిగా ఉండొచ్చు.
8. అర్జెంటీనా..
దక్షిణ అమెరికాలో ఉన్న అర్జెంటీనా, సమృద్ధమైన వ్యవసాయ వనరులతో యుద్ధ సమయంలో ఆహార భద్రతను అందిస్తుంది. భౌగోళికంగా దూరంగా ఉండే ఈ దేశం, గతంలో సంఘర్షణల చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం సాపేక్షంగా సురక్షితంగా గుర్తింపబడుతోంది.
Also Read: Israel: ఇజ్రాయెల్ విజయ రహస్యం అదే.. ఆపరేషన్స్ ఎలా నిర్వహిస్తుందో తెలుసా?
9. భూటాన్..
1971 నుంచి తటస్థతను అనుసరిస్తున్న భూటాన్, హిమాలయ పర్వతాల మధ్య ఉండే దేశం. దీని భౌగోళిక స్వరూపం బాహ్య దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తక్కువ జనాభా, శాంతియుత విధానాలు ఈ దేశాన్ని సురక్షిత ఆశ్రయంగా చేస్తాయి.
10. చిలీ..
దక్షిణ అమెరికాలో 4 వేల మైళ్ల తీరప్రాంతంతో ఉన్న చిలీ, సహజ వనరులు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థతో సురక్షిత దేశంగా నిలుస్తుంది. ఆండీస్ పర్వతాలు, విస్తారమైన తీరం రక్షణను అందిస్తాయి. రాజకీయ స్థిరత్వం, అభివద్ధి ఈ దేశాన్ని యుద్ధ కాలంలో ఆశ్రయంగా చేస్తాయి.
11. ఫిజీ..
ఆస్ట్రేలియాకు 2,700 మైళ్ల దూరంలో ఉన్న ఫిజీ, దట్టమైన అడవులు, శాంతియుత వాతావరణంతో యుద్ధ సంఘర్షణలకు దూరంగా ఉంటుంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో మంచి స్థానంలో ఉన్న ఈ దేశం, తక్కువ జనాభా, రాజకీయ తటస్థతతో సురక్షిత ఎంపిక.
మూడో∙ప్రపంచ యుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లో, భౌగోళిక ఒంటరితనం, రాజకీయ తటస్థత, సహజ వనరుల సమృద్ధి, శాంతియుత విధానాలు ఒక దేశాన్ని సురక్షితంగా చేస్తాయి. అంటార్కిటికా, ఐస్లాండ్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు ఈ లక్షణాలను కలిగి ఉన్నాయి. అయితే, ఈ దేశాల్లో మనుగడ సవాళ్లు తీవ్ర వాతావరణం, పరిమిత వనరులు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యుద్ధ భయం లేని ప్రపంచం కోసం శాంతి, సహకారం కీలకం.