Anjana Devi Health: అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారంటూ మంగళవారం ఉదయం రూమర్స్ వచ్చాయి. వీటిపై నాగబాబు స్పందించారు. తన తల్లి ఆరోగ్యం చాలా బాగుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆ వదంతులను ఖండించారు. ఆమె అస్వస్థతకు గురికావడంతోనే పవన్ కల్యాణ్ హైదరాబాద్ వచ్చారని, చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారని కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలొచ్చాయి.