Safetey Cars: 6 ఎయిర్ బ్యాగ్స్ తో సేప్టీ ఇచ్చే కార్లు ఇవే..

కొత్త స్విప్ట్ లో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్ సీ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ుంది. వీటితో పాటు ఐసోఫిక్స్ యాంకర్లను కూడా అమర్చారు.

Written By: Chai Muchhata, Updated On : May 14, 2024 10:32 am

6 air bags car

Follow us on

Safetey Cars:  కారు కొనాలనుకునే వారు ధర, ఫీచర్స్ మాత్రమే కాకుండా సెక్యూరిటీని కూడా చెక్ చేస్తున్నారు. సేప్టీ కారు ఉంటేనే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ తరుణంలో సేప్టీ కార్ల కోసం ప్రత్యేకంగా సెర్చ్ చేసేవారు లేకపోలేదు. వినియోగదారులు సేప్టీ కార్లు కొరుకుంటారని భావించిన కొన్ని కంపెనీలు సేప్టీ ఫీచర్స్ కు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇవి బెస్ట్ సేప్టీ కార్లుగా నిలిచాయి. మిగతా కార్ల కంటే ఇందులో ప్రయాణించడం వల్ల భద్రత ప్రమాణాలు ఎక్కువే అని చెప్పవచ్చు. ఇంతకీ ఆటోమోబైల్ మార్కెట్లో ఉన్న బెస్ట్ సేప్టీ కార్లు ఏవో తెలుసుకుందాం..

మంచి ఫీచర్స్ తో పాటు లో బడ్జెట్ కార్లను అందించడంలో మారుతి సుజుకీ ముందుంటుంది. ఇదే సమయంలో భద్రత కలిగిన కార్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ సేప్టీ కారు స్విప్ట్ అని చెప్పొచ్చు. ఇది న్యూ వెర్షన్ ఇటీవల రిలీజ్ అయింది. కొత్త స్విప్ట్ లో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్ సీ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ుంది. వీటితో పాటు ఐసోఫిక్స్ యాంకర్లను కూడా అమర్చారు. ఇదే కంపెనీకి చెందిన బాలెనో కారు కూడా బెస్ట్ సేప్టీ కారుగా పేర్కొనవచ్చు. ఇందులో స్టాండర్డ్ గా ట్విన్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ప్రీమియం కారులో మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు.

హ్యుందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయినా వెన్యూ 6 ఎయిర్ బ్యాగ్స్ తో ప్రయాణికులకు సేప్టీని ఇస్తోంది. కాంపాక్ట్ ఎస్ యూవీ కారు అయిన ఇందులో మూడు ఇంజిన్లు ఉంటాయి. కియా కంపెనీకి చెందిన సోనెట్ లోనూ భద్రతా పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఈఎస్ సీ, వీఎస్ ఎం, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టీఎంపీఎస్ వంటి సేప్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి కంపెనీకి గట్టి పోటీ ఇవ్వడానికి టాటా కంపెనీ ముందు ఉంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు సేప్టీ కార్లను అందించడంలోనూ సక్సెస్ అవుతోంది. ఈ తరుణంలో టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ భారతీయ కార్ల మార్కెట్లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీగా పేరొందింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ అమర్చారు. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ 20 లోనూ 6 ఎయిర్ బ్యాగ్స్ తో మంచి రక్షణ ఇస్తుంది.