World food day 2024 : ఆహహ్హ భోజనంబు.. తినే అదృష్టముండాలి.. ప్రపంచ ఫుడ్ డే చరిత్ర ఏంటి? ఎప్పుడు ప్రారంభమైందంటే?

ప్రపంచంలో ఎందరో ఆకలి, పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి వారిని కాపాడుతూ మిగతా వాళ్లకు ఆహారంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతీ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2024 2:54 pm

World World Food Day 2024Day 2024

Follow us on

World food day 2024 : ప్రతి ఒక్కరికి ఆహారం అనేది చాలా ముఖ్యం. ఆకలిని తీర్చుకోవడానికి తప్పకుండా ఫుడ్ ఉండాల్సిందే. ప్రపంచంలో చాలా మంది ఆకలితో చనిపోతున్నారు. తినడానికి తిండి లేక ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. కొందరికి అసలు ఆహారం విలువ కూడా తెలియదు. ఎక్కువగా వండటం, పడేయడం వంటివి చేస్తారు. కనీసం ఫుడ్ విలువ తెలియకుండా చాలా మంది ఫుడ్‌ను వేస్ట్ చేస్తున్నారు. ఆహారం విలువ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న ఘనంగా జరుపుకుంటారు. ఆకలిని నియంత్రించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆహారం విలువ తెలియాలని ఈ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. పోషకాహార లోపం, ఆహారం విలువ తెలియాలని, ఆహార భద్రతకు వ్యతిరేకంగా చర్యను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆకలిని నిర్మూలించడం, ఆహార భద్రతను నిర్ధారించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, స్థిరమైన ఆహార వ్యవస్థకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలో ఎందరో ఆకలి, పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి వారిని కాపాడుతూ మిగతా వాళ్లకు ఆహారంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

దీని చరిత్ర?

ప్రపంచంలో ఎందరో ఆకలితో బాధపడుతున్నారు. ఒక పూట తింటే ఇంకో పూట తినడానికి తిండి ఉండటం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 1945లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తొలిసారిగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1979లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. దీంతో అలా అప్పటి నుంచి ప్రతీ ఏడాది ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ దినోత్సవం రోజు ఆహార భద్రతతో పాటు మిగతా విషయాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆహారం తప్పకుండా అందాలని, దాని విలువ తెలియాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తారు.

ఈ ఏడాది థీమ్ ఏంటంటే?
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఈ ఏడాది మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు అనే థీమ్‌తో నిర్వహించుకుంటున్నారు.