Ratan Tata: సంపన్న కుటుంబంలో పుట్టిన రతన్ టాటా సామాన్యుడిలా జీవించారు. టాటా ఫ్యామిలీ అంతా ఇలాగే ఉంటుంది. హంగులు, ఆర్భాటాలకు పోరు. నిరాడంబర జీవితం గడుపుతారు. రతన్ టాటా కూడా ఇలాగే గడిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో దాతృత్వానికి ప్రతీకగా నిలిచారు. వేల కోట్ల రూపాయలు సేవ కోసం ఖర్చు చేశారు. టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా మరణంతో ఆయన ఆస్తులకు, వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు? ఆయన ఆస్తులు ఎవరి సొంతం అవుతాయి అనే చర్చ జరుగుతోంది. అయితే సంపన్నులు తమ మరణానంతరం వారసత్వ సమస్య రాకుండా వీలునామా రాస్తారు. ఇలాగే రతన్‌టాటా కూడా తన వారుసులు, ఆస్తుల గురించి వీలునామా రాశారు. రతన్ టాటా ఆజన్మ బ్రహ్మచారి. ఆయన ఓ యువతిని ప్రేమించారు. కానీ పెళ్లి వరకు ఆ ప్రేమ చేరలేదు. తర్వాత మరో మూడు నాలుగు పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా.. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆయనకు భార్య, పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తికి టాటా సవతి సోదరుడి పిల్లలు వారసులవుతారన్న ప్రచారం జరుగుతోంది. వీరు ఇప్పటికే టాటా గ్రూప్, టాటా సన్స్ గ్రూప్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. రతన్ టాటా సుమారు రూ.3,500 కోట్ల ఆస్తి ఉంది. ఈ ఆస్తితోపాటు, తన వ్యాపార వారసత్వాన్ని రతన్ టాటా సవతి సోదరుడి పిల్లలు చూసుకునేలా వీలునామా రాశారని తెలుస్తోంది.
చిన్న తనంలో విడిపోయిన తల్లిదండ్రులు..
రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. 1940లో అంటే రతన్ టాటా వయసు 10 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడీకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా సిమోన్‌ను వివాహనం చేసుకున్నాడు. వీరికి నోయెల్ టాటా జన్మించాడు. ఈయనే రతన్ టాటాకు సవతి సోదరుడు. ఈ నోయెల్ టాటా–ఆలూ మిస్త్రీ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. లీయో టాటా పెద్ద కూతరు, తర్వాత కుమారుడు నెవిల్లే టాటా, మూడో కూతురు మాయా టాటా. ఈ ముగ్గురు పిల్లలంటే రతన్ టాటాకు బాగా ఇష్టం. వీరు రతన్ టాటాను కూడా బాగా చూసుకునేవారు. ఈ నేపథ్యంలోనే రనత్ టాటా తన వేల కోట్ల ఆస్తులను వీరిపేరిట రాసినట్లు తెలుస్తోంది.
కుటుంబానికి 30 శాతం..
ఇదిలా ఉంటే.. రతన్ టాటా తన ఆస్తుల్లో 30 శాతం మాత్రమే రాసినట్లు తెలుస్తోంది. మిగతా సొమ్ము సేవ చేసే ట్రస్టులకు చెందేలా వీలునామా రాసినట్లు సమాచారం. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సేవకు ఖర్చు చేసిన రతన్ టాటా తన మరణం తర్వాత ఆస్తిలోను మెజారిటీ వాటాను ట్రప్టులకే చెందేలా వీలునామా రాశారు.
వారసురాలిగా మాయా టాటా..
ఇదిలా ఉంటే.. రతన్ టాటా వ్యాపార వారసురాలిగా మాయా టాటా అవుతారని ప్రచారం జరుగుతోంది. మాయా టాటా వయసు 34 ఏళ్లు. యూకేలోని బేయన్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ పొందింది. ఇండియాకు వచ్చిన తర్వాత టాటా క్యాపిటల్ ఫండ్స్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు చూసుకుంటుంది. కోల్‌కతాలో రతన్ టాటా నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణంలోని మాయా టాటా కీకలంగా వ్యవహరించారు. డిజిటల్ రంగంలో టాటాను విస్తరించడానికి టాటా నియో యాప్‌ను కూడా తీసుకొచ్చారు. టాటాకు చెందిన నాలుగు ట్రస్టులను కూడా మాయా టాటా చూసుకుంటున్నారు. రతన్‌టాటాకు దగ్గరగా ఉండడం కారణంగానే టాటా సన్స్‌కు సంబంధించిన ఆస్తులతోపాటు, వ్యాపార వారసురాలిగా మాయా టాటాను ఎంపిక చేశారని తెలుస్తోంది.