Women: సాధారణంగా మహిళలు పిల్లలను కనే వయసు నలభై ఏళ్ల వరకు ఉంటుంది. కానీ పాకిస్తాన్ లోని ఓ తెగకు చెందిన వారు సుమారు 65 ఏళ్ల వరకు కూడా పిల్లల్ని కంటుండటం ఆశ్చర్యకరమే. 65 ఏళ్ల వయసులో కూడా వారు పునరుత్పత్తిలో పాల్గొనడం విశేషమే. కానీ ఇది నిజం. అభూత కల్పన మాత్రం కాదు. వారిలో ఉన్న ఆరోగ్య కర వాతావరణమే వారిని ఈ విధంగా పురిగొల్పుతుందని తెలుస్తోంది. వారి ఆచార వ్యవహారాలు అలా ఉన్నందునే వారిలో ఆరోగ్యం సహకరించి వారు ఆ వయసులో కూడా పిల్లల్ని కనేందుకు సిద్ధపడటం తెలుస్తోంది.

మహిళలు అరవై అయిదు ఏళ్ల వయసులో మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా గడిపే సమయం. దీంతో వారు మాత్రం ఆ వయసులో తల్లులు కావడం యాదృశ్చికం కాదు. అది వారి ఆచార వ్యవహారాల్లో ఒక భాగమే కావడం విశేషం. మనవల పెళ్లిళ్లు చూసే వయసులో వారు పిల్లల్ని కనడం ఓ వింతే. భారతదేశంలో మాత్రం నలభై ఐదు ఏళ్ల వరకు కంటుంటారు. కానీ వీరు మాత్రం అరవై ఐదు ఏళ్లకు కూడా పిల్లల్ని కనడం చూస్తుంటే ఇదేదో అద్భుతంగానే తోస్తుంది.
పాకిస్తాన్ లోని ఒక తెగకు చెందిన మహిళలు అరవై ఐదు ఏళ్ల వయసులో తల్లులు కావడానికి ప్రయత్నించడం అరుదైన విషయమే. బురుషో కమ్యూనిటీలో వారి భాష బురుషాస్కీ. ఈ జాతిలో అందరు కూడా వంద సంవత్సరాలు దాటిన వారినే చూడవచ్చు. వారి ఆరోగ్య రహస్యం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వీరి జీవనశైలి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
Also Read: బిగ్ బాస్ లో ప్రియుడి దారుణాలు చూసి అన్ ఫాలో చేసిన ప్రియురాలు
పాకిస్తాన్ లోని హుంజా వ్యాలీలో నివసిస్తారు. వీరి ఆరోగ్యంపై పరిశోధనలు కూడా జరిగాయి. మహిళల్లో అందం అందరిని ఆకర్షిస్తుంది. వీరు అందంగా ఉంటారు. 70 ఏళ్ల వయసులోనూ పిల్లల్ని కనడం వీరిలో ప్రత్యేకత. ఇక్కడి ప్రజలు హిమాలయాల నుంచి వచ్చే నీరు తాగుతారు. వాటితోనే స్నానాలు చేస్తారు. అందుకే వీరిలో ఆరోగ్యం ఉంటుందని తెలుస్తోంది.
Also Read: Chennai Rains: తమిళనాడు కన్నీటిసాగరం.. ఎస్ఐ రాజేశ్వరి చూపిన సాహసం.. వైరల్ వీడియో