Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో మొత్తానికి హోరా హోరి గా సాగుతుంది. బిగ్ బాస్ లో ఉన్న పది మంది కుటుంబ సభ్యులు టాప్ 5 లో చోటు సంపాదించుకోవడం కోసం పోటా పోటీగా కష్టపడుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుండి తగినంత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నారని ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.

ఎలాంటి నేపథ్యం లో టాప్ 5 లో చోటు ఎవరు సంపాదించుకుంటారు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే ర్యాంకింగ్స్ ఇచ్చే కొన్ని సంస్థలు ఇచ్చే గణాంకాల ప్రకారం బిగ్ బాస్ టాప్ 5 లో ఎవరు చేరుతారనే విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళ్తే…
బిగ్ బాస్ 67 రోజులు పూర్తి చేసుకుని 70 రోజులకి చేరువుగా నిలిచింది. దగ్గర దగ్గరగా ఇంకొక 40 రోజుల మిగిలే ఉంది. అయితే రానున్న రోజుల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకి గేమ్ మరింత కీలకంగా మారనున్నది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరూ తోచిన విధంగా తమ సత్తా తెలియపరచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
టాప్ 5 రేసులో ఆ పదిమంది: బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లను కింగ్ నాగార్జున పంపాడు. అయితే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వగా ఇంకా పదిమంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5 ఐ ఎవరు వెళ్తారనే విషయం ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Deepthi Sunayana: బిగ్ బాస్ లో ప్రియుడి దారుణాలు చూసి అన్ ఫాలో చేసిన ప్రియురాలు
ఈ షోలో అత్యధికంగా ఓటింగ్‌తోపాటు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న వారిలో యూట్యూబ్ సెన్సేషన్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఎంటర్టైనర్ సన్నీనిలవగా, మూడో స్థానంలో ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్ర, నాలుగో స్థానంలో ప్రముఖ టీవీ యాంకర్, నటుడు రవి ఉండగా, ఐదో స్థానంలో సిరి హన్మంతు ఉన్నారు. వీరు టాప్ 5లో ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
Also Read: Actress ileana: తన చేతి మీద ఉన్న పచ్చబొట్ల సీక్రెట్ రివీల్ చేసిన గోవా బ్యూటీ… ఇలియానా