https://oktelugu.com/

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 150 ఉద్యోగ ఖాళీలు.. రాత పరీక్ష లేకుండా?

వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురు చెప్పింది. గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ నెల 18వ తేదీ వరకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2021 / 09:49 AM IST
    Follow us on

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురు చెప్పింది. గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

    ఈ నెల 18వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా లేదా బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా https://www.vizagsteel.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అకడమిక్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    నవంబర్ నెల 11వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.vizagsteel.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్, కెమికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.