Homeఅంతర్జాతీయంIran war NATO countries staying away: ఇరాన్‌ యుద్ధం.. దూరంగా నాటో దేశాలు.. కారణం...

Iran war NATO countries staying away: ఇరాన్‌ యుద్ధం.. దూరంగా నాటో దేశాలు.. కారణం ఇదే!

Iran war NATO countries staying away: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలై పది రోజులైంది. అమెరికా ఏ యుద్ధం చేసినా తన చేతులకు మట్టి అట్టంకుడా చూసుకుంటుంది. గతంలో చేసిన యుద్ధాలన్నీ ఇలాగే చేసింది. నాటో దేశాలను ముందు ఉంచి అమెరికా వెనుక ఉంటుంది. కానీ ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం భిన్నంగా కనిపిస్తోంది. ఇందులోకి నాటు దేశాలు రావడం లేదు. అమెరికా–ఇజ్రాయెల్‌ మాత్రమే పోరాడుతున్నాయి. ఇప్పటికే యుద్ధం గల్ఫ్‌ దేశాలకు విస్తరించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా 30 దేశాలు పాల్గొంటున్నాయి. అయినా నాటో దేశాలు ఇన్‌వాల్వ్‌ కావడం లేదు.

గత యుద్ధాలతో పోలిక
ఆఫ్గాన్, లిబియా, ఇరాక్‌లో నాటో దేశాలు ముందంజలో నిలిచాయి. ఇరాన్‌పై దాడులకు మాత్రం ప్రాంస్, జర్మనీ, యూకే దూరంగా ఉన్నాయి. టర్కీపై ఇరాన్‌ దాడి జరిగినా నాటో స్పందన లేదు. యూరప్‌ యుద్ధాల చరిత్ర ఫలితాలు తెలిసినందున ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది.

ట్రంప్‌ యుగంలో మార్పు
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక నాటో దేశాలు అమెరికాతో అంటీ ముట్టనట్టు ఉంటున్నాయి. టారిఫ్‌ల విధింపు, గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికి యత్నించడం తదితర కారణాలు ఇందుకు కారణం. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధంలో నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి. కానీ ఇరాన్‌ యుద్ధంలో అస్సలుకే జోక్యం చేసుకోవడం లేదు. ఇరాన్‌తో యూరప్‌కు ప్రత్యక్ష గొడవ లేనందున, ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ దూరం అమెరికా వ్యూహాన్ని బలహీనపరుస్తోంది.

ఆర్థిక, భౌగోళిక కారణాలు
ఆర్మూజ్‌ జలసంధి మూసివేతతో చమురు సరఫరా ఆగిపోయింది. యూరప్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇరాన్‌ యుద్ధం యూరప్‌కు దూరమైనా, చమురు ధరలు, ఆధారాలు ప్రభావితమవుతాయి. యూరప్‌ దేశాలు ఈ ప్రమాదాన్ని ఆగమం చేసి, మధ్యవర్తిత్వం ప్రయత్నిస్తున్నాయి. ఇది యుద్ధాన్ని పొడిగించే అవకాశం కల్పిస్తుంది.

నాటో దూరం అమెరికాను ఒంటరిగా చేసి, ఇరాన్‌కు ధైర్యం కల్పిస్తోంది. యూరప్‌ యుద్ధ గాయాలు, ఆర్థిక ఆధారాలు ఈ నిర్ణయానికి కారణం. ఇది మధ్యప్రాచ్య ఘర్షణను ప్రపంచ స్థాయి సంక్షోభంగా మార్చవచ్చు. దీర్ఘకాలంలో యూరప్‌ మధ్యవర్తిగా నిలబడి, శాంతి చర్చలకు దారితీయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular