World Kindness Day 2024: ప్రతీ ఏడాది నవంబర్ 13వ తేదీన ప్రపంచ దయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కరుణ, సానుభూతి, సద్భావనను ప్రేరేపించే వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే ప్రపంచంలో శాంతియుతంగా అన్ని జరగాలని గొడవలు లేకుండా ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తితో ఉండాలని జరుపుకుంటారు. ఒకరు దయతో ఉండే మిగతా వారు కూడా అది పాటిస్తారని, కొందరికి అవగాహన కల్పిస్తే ప్రపంచమంతా అదే అలవాటు అవుతుందని ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ దయ దినోత్సవం అనేది ప్రపంచ దయ ఉద్యమం ద్వారా ఏర్పడింది. 1998 నుంచి ప్రతీ ఏడాది ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నారు. 1997లో టోక్యోలో ఓ సమావేశం జరిగింది. అప్పడు దయ దినోత్సవం జరగాలనే ప్రస్తావన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత సింగపూర్‌లో 2000లో కాన్ఫరెన్స్ పెట్టారు. అప్పటి నుంచి ఈ ప్రపంచ దయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రపంచ దయ దినోత్సవం విషెష్ చెప్పండిలా..
సున్నితత్వం, దయ, బలహీనత, నిరాశకు సంకేతాలు కాదు.. కానీ నీ బలమే ఆయుధం. కాబట్టి దయతో ఉండండి
దయ అనేది చెవిటివారు వినగలిగేది, అంధులు చూడగలిగే భాష.. ప్రపంచ దయ దినోత్సవ శుభాకాంక్షలు
వంగి ప్రార్థన చేసే వారి కంటే దయతో ఉండటం చాలా ముఖ్యం.. దయ దినోత్సవ శుభాకాంక్షలు
చేసిన మేలును మరిచిపోకుండా దయతో ఉండాలని దయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రపంచ దయ దినోత్సవం సందర్భంగా.. నేను మీకు దయ, కరుణ, సంతోషకరమైన రోజును కోరుకుంటున్నాను
ఇతరులకు ఎప్పుడూ ప్రేమ, దయ, ఆప్యాయతలను ఇవ్వండని కోరుతూ దయ దినోత్సవ శుభాకాంక్షలు
మీ చుట్టూ ఉన్న ఇతరుల జీవితాలను ప్రకాశవంతం చేసే కాంతిగా ఉండనివ్వండని దయ దినోత్సవ శుభాకాంక్షలు
కరుణతో అందరి మీద ఉండండని.. ప్రపంచ దయ దినోత్సవ శుభాకాంక్షలు
దయతో ఉండి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ.. ప్రపంచ దయ దినోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచ దయ దినోత్సవం రోజు ఈ నియమాలు పాటించండి
ప్రపంచ దయ దినోత్సవ సందర్భంగా అందరితో దయతో ఉండండి. కష్టాల్లో ఉన్నవారిని దయతో చూడండి. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి. వారికి ఉన్న ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే దగ్గర బంధువులతో కలిసి ఉండండి. మీకు కావాల్సిన వారు చేసిన సాయాన్ని అసలు మర్చిపోవద్దు. కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరితో ఉండండి. ఎవరైనా కష్ట సమయాల్లో కనిపిస్తే వారికి సాయం చేసి ఆదుకోండి. ముఖ్యంగా మీకు సాయం చేసిన వారిని అసలు మర్చిపోవద్దు. కొందరు అవసరం ఉన్నప్పుడు ఒకలా తర్వాత ఒకలా ఉంటారు. అలా అసలు ఉండవద్దు. ప్రతీ ఒక్కరితో కూడా దయా గుణంతో ఉండండి. అప్పుడే ప్రపంచాన్ని దయ గుణంలో నడిపించవచ్చు. కేవలం ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతీ రోజు కూడా ఈ నియమాలు పాటిస్తే ప్రపంచం దయా గుణంలో వెళ్తుంది.