HezBollah : నస్రల్లా ఇజ్రాయిల్ చేతిలో ఖతమయ్యాడు.. హెజ్ బొల్లా కు తదుపరి నాయకుడు అతడేనా?

పశ్చిమసియాలో పరిణామాలు అంతకంతకు దిగజారుతున్నాయి. యుద్ధం తాలూకు పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్ భీకరమైన దాడులు చేస్తోంది. ఇప్పటికే హెజ్ బొల్లా చీఫ్ హతమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హెజ్ బొల్లాకు తదుపరి సారథి ఎవరనే ప్రశ్న ఎదురవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 10:35 pm

Israel vs HezBollah

Follow us on

HezBollah  Hassan Nasrallah : డిఫెన్స్ టెక్నాలజీలో అన్ని దేశాల కంటే ముందు వరుసలో ఉన్న ఇజ్రాయిల్ హెజ్ బొల్లా పై వరుస దాడులు చేస్తోంది. ఇప్పటికే ఫేజర్, వాకి టాకీ బాంబులను పేల్చి హెజ్ బొల్లా కు చుక్కలు చూపించింది. అంతర్గత ఆపరేషన్లు చేయడంలో దిట్టైన మోస్సాద్(ఇజ్రాయిల్ గూడ చర్య సంస్థ) హెజ్ బొల్లా ను కోలుకోకుండా చేసింది. రహస్య ఆపరేషన్లు చేపట్టి హెజ్ బొల్లా కీలక నాయకులను మట్టు పెట్టింది. చివరికి హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లా ను కూడా హతమార్చింది. అంతకుముందు కీలకమైన నాయకులను తుద ముట్టించింది. మొత్తంగా హెజ్ బొల్లాలో ధైర్యాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది..” హెజ్ బొల్లా నిర్వీర్యం అస్సలు కాదు. నస్రల్లా నేలకొరిగితే హెజ్ బొల్లా అంతమైనట్టు కాదు. మా పోరాటం ఆగదు. మా సామర్థ్యం నేల చూపులు చూడదు. ఇలాంటి ఎదుట దెబ్బలు మాకు చాలా తగిలాయి. అయినా కూడా మేము దూసుకు వస్తామని” హెజ్ బొల్లా నేతలు చెబుతున్నారు. అయితే ఇవన్నీ మేకపోతు గాంభీర్యం సామెత తాలూకు మాటలేనని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ” హెజ్ బొల్లా నిర్వీర్యం కాకపోయినప్పటికీ.. నస్రల్లా చనిపోవడం ఆ సంస్థకు ఎదురు దెబ్బ అని” వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే హెజ్ బొల్లా కీలక నాయకులు మాత్రం ఇతర మిత్రపక్షలతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, నస్రల్లా లెబనాన్ ప్రభుత్వంలో ఎటువంటి పదవులు చేపట్టలేదు. అయితే దేశంలో విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతడు కన్నుమూసిన నేపథ్యంలో.. తదుపరివారసుడు ఎవరు అనే చర్చ ప్రారంభమైంది.

ఇజ్రాయిల్ పై పోరాట విషయంలో ఇరాన్, హెజ్ బొల్లా సంయుక్తంగానే ఉన్నాయి. పలు విషయాలలో పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. నస్రల్లా చనిపోయిన నేపథ్యంలో ఇరాన్ – హెజ్ బొల్లా పరస్పర అనుమతితోనే తదుపరి వారసుడిని ప్రకటిస్తాయని తెలుస్తోంది. హెజ్ బొల్లా గ్రూపుకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలను హసీం సఫిద్దిన్ పర్యవేక్షిస్తున్నాడు. నస్రల్లా చనిపోయిన తర్వాత అతడిని తదుపరి వారసుడిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. హసీం హెజ్ బొల్లా జిహాద్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.. హసీం కు నస్రల్లా కు దగ్గరి బంధుత్వం ఉంది. గతంలోనే నస్రల్లా హసీం కు నాయకత్వ లక్షణాలను నేర్పించినట్టు తెలుస్తోంది. పైగా వారిద్దరిలోనూ ఒకే పోలికలు ఉంటాయి. హసీం ను అమెరికా 2017 లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

1992లో ఇజ్రాయిల్ దళాలు అప్పటి హెజ్ బొల్లా చీఫ్ అబ్బాస్ ను హతమార్చారి. ఆ సమయంలో నస్రల్లా వయసు 32 సంవత్సరాలు మాత్రమే. అతని ఆధ్వర్యంలో హెజ్ బొల్లా విపరీతమైన బలాన్ని సంతరించుకుంది. అప్పట్లో ఇజ్రాయిల్ దళాలు హెజ్ బొల్లా గ్రూప్ ఈ స్థాయిలో బలపడుతుందని ఊహించి ఉండవు. 2006లో లెబనాన్ లో 34 రోజులపాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం లో ఇజ్రాయిల్ వెనకడుగు వేయడంలో నస్రల్లా కీలక పాత్ర పోషించాడు . అప్పటినుంచి ఇజ్రాయిల్ అతడిని బద్ధ శత్రువుగా చూడడం మొదలు పెట్టింది. గాజా లో కాల్పులను విరమించే వరకు ఇజ్రాయిల్ పై తమ దాడులు సాగుతూనే ఉంటాయని ఇటీవల నస్రల్లా ప్రకటించాడు. అయితే అతడిని చంపడానికి ఇజ్రాయిల్ అనేకసార్లు ప్రయత్నించింది. చివరికి చంపేసింది. హెజ్ బొల్లా గ్రూప్ నస్రల్లా కూడా అధికారికంగా ధ్రువీకరించింది.