Hanuman movie : విభీషణుడు బతికే ఉన్నాడా? హనుమాన్ సినిమా అందుకే హిట్ అయిందా?

ఓ సన్నివేశంలో ఆయన చెప్పే డైలాగ్స్.. కార్తికేయ-2 లో అనుపర్ కేర్ గుర్తు చేశాయట చాలా మందికి. ఇక హనుమాన్’ మూవీలో విభీషణుడ్ని బతికే ఉన్నట్లు ప్రశాంత్ వర్మ చూపించారన్నమాట.

Written By: Swathi Chilukuri, Updated On : September 28, 2024 4:17 pm

Hanuman movie

Follow us on

Hanuman movie : విడుదలైన కొత్తలో సునామీ సృష్టించింది చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ . ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన సినిమా హనుమాన్. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్యమైన పాత్రలో మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాలో అమృత అయ్యర్ తేజాకు జోడిగా నటించింది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు కలెక్షన్స్ సైతం భారీగానే సంపాదించింది ఈ సినిమా. ఈ సినిమా కథ, కథనం, విజువల్స్, నటీనటుల యాక్టింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమాలో వచ్చే విభీషణుడి క్యారెక్టర్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టిందనే చెప్పాలి.

ఈ సినిమాలో పూరాణాల్లో ఉన్న విభీషణుడి పాత్రను చూపించారు డైరెక్టర్. హీరోను బ్యాగ్రౌండ్ లో డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు విభీషణుడు. అయితే ప్రశాంత్ వర్మ.. ఈ విభీషణుడి క్యారెక్టర్ ను తీసుకోవడం పట్ల అందరూ ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పురాణాల్లో ఉన్న విభీషణుడు నేటి కాలంలో కూడా బతికే ఉన్నాడా అనే అనుమానం చాలా మందిలో వస్తున్నాయి. ఇంతకీ అసలు నిజం ఏంటి అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం.

విభీషణుడు ఎవరు?: విభీషణుడు లంకాధిపతి రావణాసురుడి సోదరుడు. రామరావణ యుద్ధంలో రాముడి పక్షాన నిలిస్తాడు ఈయన. అంతేకాదు రాముడు రావణాసురుడిని అంతమొందించడంలో విభీషణుడి పాత్ర కీలకంగా ఉంటుంది. ఆయన ఇచ్చిన సలహాతోనే రాముడు రావణుడిని చంపేస్తాడు. అనంతరం విభీషణుడికి శ్రీరాముడు ఓ వరం ఇస్తాడని పురాణలు చెబుతున్నాయి. బంధాలు అనుబంధాలని కాకుండా.. ధర్మం వైపు నిలబడిన వ్యక్తివి కాబట్టి..చిరంజీవిగా లంకను పరిపాలిస్తూ ఉంటావు అంటూ వరం పొందుతాడు.

విభీషణుడు బతికే ఉన్నాడా?
రాముడి వరం వల్ల విభీషణుడు లంకను పరిపాలిస్తుంటాడు. అయితే రాముడు వరం కారణంగా ఆయనకు మరణం ఉండదు అంటున్నాయి పురాణాలు. యుగాలు మారిన ఆయన చిరంజీవిగానే ఉంటాడట. భారత పురాణాల ప్రకారం.. ఏడు మందిని చిరంజీవులు అంటారు. అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు అని ఏడుగురు ఉంటారు. ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అంటారు. చిరంజీవులు అంటే మరణం లేని వారు అని అర్థం. అంటే వీరు ఏ కాలంలో అయినా జీవించి ఉంటారు.

ప్రశాంత్ వర్మ పట్టుకున్న పాయింట్ అదే:
ఇక ప్రశాంత్ వర్మ కూడా పురాణాల్లోని చిరంజీవి అనే అంశాన్ని పట్టుకొని సినిమా తెరకెక్కించారు. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాకు ఏ పాత్ర అయితే స్కోప్ ఉందో..దానిని తీసుకుని ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే హీరోను డ్రైవ్ చేసే వ్యక్తిగా విభీషణుడిని ప్రశాంత్ వర్మ అద్భుతంగా సృష్టించాడు. ఇక ఈ చిరంజీవుల్లో విభీషణుడు ఒకరు కాబట్టి.. హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ.. ఆ క్యారెక్టర్ ను తీసుకొని వచ్చాడు. అంతేకాక తన చరిత్రను చెబుతూ.. హీరోకు మద్దతు విభీషణుడు నిలబడిన విధానాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. చిరంజీవులు ఏ కాలంలోనైనా ఉంటారని పురాణాలు చెప్తుండటంతో.. హనుమాన్ సినిమాలో విభీషణుడిని ప్రశాంత్ వర్మ చూపిస్తూ  ఈ పాత్రను తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ విజయం సాధించారు. ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో సముద్రఖని అద్భుతంగా నటించారు. ఓ సన్నివేశంలో ఆయన చెప్పే డైలాగ్స్.. కార్తికేయ-2 లో అనుపర్ కేర్ గుర్తు చేశాయట చాలా మందికి. ఇక హనుమాన్’ మూవీలో విభీషణుడ్ని బతికే ఉన్నట్లు ప్రశాంత్ వర్మ చూపించారన్నమాట.