Nepal Plane Crash 2023: యతి ఎయిర్లైన్స్ విమానం నేపాల్ లోని పోక్రా విమానాశ్రయం వద్ద కుప్పకూలడంతో 72 మంది మరణించారు.. దీంతో నేపాల్ దేశం మరోసారి వార్తల్లోకి వచ్చింది.. ఇక ఈ ప్రమాదం నేపాల్ చరిత్రలోనే మూడో అతి పెద్దది.. మార్గం మధ్యలో సాంకేతిక కారణాలవల్ల విమానాలు కుప్పకూడం చూసి ఉంటాం.. కానీ రన్ వే పై ఉండగానే విమానం ప్రమాదానికి గురి కావడం బహుశా నేపాల్ దేశంలోనే సాధ్యం కావచ్చు.

ఎందుకు ఇలా?
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రన్ వే లు నేపాల్ లో ఉన్నాయి.. ముఖ్యంగా “లుకుల” వంటి ప్రమాదకరమైన రన్ వేల పై విమానాలు దింపటం నిపుణులైన పైలెట్లకు కూడా చాలా కష్టం.. మౌంట్ ఎవరెస్టు వెళ్లే వారికి ఈ ఎయిర్పోర్ట్ చాలా కీలకం.. సముద్రమట్టానికి చాలా ఎత్తులో పర్వతాల మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది.. ఇక్కడ రన్ వే చాలా చిన్నది.. దీని పొడవు కేవలం 527 మీటర్లు మాత్రమే. ఇలాంటి రన్ వే పై విమానాన్ని దించడం అంటే పైలెట్లకు కత్తి మీద సాము లాంటిదే. ఇక ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 12 పర్వతాల్లో 8 నేపాల్ దేశంలోనే ఉన్నాయి.. అంటే అక్కడి భౌగోళిక పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పర్వతప్రాంతాలే కాదు.. నేపాల్ దేశంలో వాతావరణ కూడా చాలా వేగంగా మారిపోతుంది.. దీనికి తోడు ఎయిర్పోర్టులు పర్వతాలపై సముద్రమట్టానికి ఎత్తుగా ఉంటాయి. గాలి సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది.. ఫలితంగా విమానాల ఇంజన్ల సామర్థ్యం తగ్గిపోతుంది.. హఠాత్తుగా వాతావరణం మారిపోతే మార్గం కనిపించదు.. దీనికి తోడు గాలి సాంద్రతలో ఆరోగ్యమైన మార్పులు ప్రయాణాన్ని మరింత కఠినంగా మార్చేస్తాయి.. ఇది పైలెట్లకు ఇబ్బందికరంగా మారుతుంది.. ఇక నేపాల్ లో వాడే పాత విమానాలకు వాతావరణంలో అనుహ్యమైన మార్పులను తట్టుకునే సామర్థ్యం ఉండదు.. బ్రిటన్ వంటి దేశాలు నేపాల్ లో తమ దౌత్య కార్యాలయాల సిబ్బందిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు.. ఇక్కడ వాతావరణం దెబ్బకు ప్రమాదానికి గురయ్యే చిన్న చిన్న విమానాలకు లెక్కేలేదు.

ఇక ప్రపంచంలోనే అతి పేద దేశాల్లో నేపాల్ కూడా ఒకటి.. ఇక్కడ విమాన సర్వీసులు నిర్వహించే సంస్థలు దేశీయ ప్రయాణాలకు పాత విమానాలనే వాడతాయి.. అనుకోని సమస్య ఎదురైతే తట్టుకునే అత్యాధునిక రాడార్లు, జిపిఎస్ టెక్నాలజీ వంటివి ఉండవు.. అక్కడ ఇప్పటికి దశాబ్దాల నాటి విమానాలు వినియోగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. పరిస్థితుల మార్పు తెచ్చేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తో నేపాల్ కలిసి పని చేస్తోంది. అయితే ఇక నేపాల్ దేశంలో కూడా ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఇష్టపడరు.. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి ఇందుకు కారణం. ఈ తరుణంలో భారీ పెట్టుబడులు పెట్టి విమానాలు కొనేందుకు విమానయాన సంస్థలు ముందుకు రావడం లేదు. ఫలితంగా కాలం చెల్లిన విమానాలను వాడాల్సి వస్తోంది.. అందువల్లే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.