Homeఅంతర్జాతీయంWashington DC Plane Crash: విమానం, హెలిక్యాప్టర్‌ ఢీ.. నదిలో కూలిపోయాయి.. ఘోర విషాదం.. వీడియో...

Washington DC Plane Crash: విమానం, హెలిక్యాప్టర్‌ ఢీ.. నదిలో కూలిపోయాయి.. ఘోర విషాదం.. వీడియో వైరల్‌

Washington DC Plane Crash:  అగ్రరాజ్యం అమెరికా(America)లో 2025లో తొలి విమాన ప్రమాదం జరిగింది. 64 మందితో వెళ్తున్న ప్రయాణికుల విమానం.. మరో హెలిక్యాప్టర్‌(Helicaptar) పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాక్‌ నదిలో పడిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

బుధవారం రాత్రి ఘటన..

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం(జనవరి 29)రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌(PSA Airliance) ప్రయాణికుల విమానం కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరింది. వాషింగ్‌టన్‌(Washington) సమీపంలోని రోనాల్డ్‌ రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌ పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా రక్షణ శాఖకు చెందిన హెలిక్యాప్టర్‌ సికోర్స్క్‌హెచ్‌–60 బ్లాకోక్‌ హెలిక్యాప్టర్‌ను ఢీకొట్టింది. ఆకాశంలోనే జరిగిన ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన నిర్వహణ సంస్థ పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. విమానంలో నలుగురు సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఇక హెలిక్యాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేదరని రక్షణ శాఖ అధికారి తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్‌..
ప్రమాదం సమాచారం అందుకున్న ఎయిర్‌ఫోర్స్, రెస్కూ సిబ్బంది వెంనేట ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టానికి సబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుఉడ జేడీ వాన్స్‌ ఎక్స్‌లో స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

వీడియో వైరల్‌..
విమానం, హెలిక్యాప్టర్‌ ఢీకొన్న ఘటనకు సంబంధింన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విమానం ల్యాండ్‌ అవుతుండగా ఎయిర్‌ పోర్టు నుంచి ఎవరో వీడియో తీశారు. ఈ సమయంలోనే హెలిక్యాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ దృశ్యం వీడియోలో రికార్డు అయింది. దానిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతోంది.

2017లో ఇంగ్లండ్‌లో..
ఇదిలా ఉంటే.. 2017 నవంబర్‌ 18న ఇంగ్లండ్‌లోని హాల్టన్‌లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. అయితే ఇక్కడ ఢీకొన్నవి రెండూ శిక్షణ విమానాలే కావడంతో ప్రాణ నష్టం పెద్దగా జరుగలేదు. వైకోమ్‌ ఎయిర్‌ పార్కు నుంచి బయల్దేరిన విమానం, హెలిక్యాప్టర్‌ రాయల్‌ ఎయిర్ఫ్‌ర్స్‌ బేస్‌ సమీపంలో ఢీకొన్నాయి. ఆకాశంలోనే ఢీకొని పెద్ద శబ్దంతో కుప్పకూలాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఓవైపు రోడ్లపై యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆకాశంలోనూ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular