Ranji Trophy 2025: గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లో లేడు. మునుపటిలాగా ఆడలేక పోతున్నాడు. దూకుడు అయిన ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. బలమైన షాట్లు కొట్టలేకపోతున్నాడు. పరుగుల ప్రవాహాన్ని సృష్టించలేకపోతున్నాడు. అనామక బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టిన ఆటగాడు.. సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమవుతున్నాడు. ఇది టీమిండియాను ఇబ్బందికి గురిచేస్తున్నది. జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో విరాట్ సరిగ్గా ఆడకపోవడం.. అది జట్టును కుంగు బాటుకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో జట్టు మేనేజ్మెంట్ సూచించిన ప్రకారం విరాట్ కోహ్లీ రంజి లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన సొంత రాష్ట్రమైన ఢిల్లీ జట్టు తరఫున ఆడాలని భావించాడు. సుదీర్ఘకాలం తర్వాత అతడు రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు.
తొక్కిసలాట
సుదీర్ఘకాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టు తరఫున అతడు ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో రైల్వే జట్టుతో తలపడుతోంది. జనవరి 30 గురువారం నాడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలైంది. అయితే చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో.. అతడిని చూడడానికి అభిమానులు భారీగా వచ్చారు. అభిమానులు భారీగా తరలి రావడంతో అరుణ్ జైట్లీ స్టేడియం 16వ గేటు వద్ద పరిస్థితి ఒక్కసారి అదుపుతప్పింది. భారీగా ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు అభిమానులు గాయపడ్డారు. వారి పాదరక్షలు, బ్యాగులు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రేక్షకులు భారీగా రావడంతో ఓ పోలీసు ద్విచక్ర వాహనం ధ్వంసం అయింది. వాస్తవానికి ఇంటర్నేషనల్ మ్యాచ్ కు కూడా లేనంతగా అభిమానులు తండోపతండాలుగా తరలిరావడంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే అభిమానులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో.. తొక్కిసలాట జరిగిన క్రమంలో.. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో గాయాల వరకే ఈ ఘటన పరిమితమైంది. ఒకవేళ ప్రమాదం గనుక మరింత తీవ్రంగా జరిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. చాలామంది అభిమానుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అయితే ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ” విరాట్ చాలా కాలం తర్వాత రంజి ఆడుతున్నాడు. అతడిని చూడాలని ఉంది. అందుకోసమే తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చాం. కానీ మాలాగే చాలామంది వచ్చారు. దీంతో రద్దీ ఏర్పడింది. ఒకానొక దశలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆ తర్వాత పోలీసులు రావడంతో పరిస్థితి కాస్త మెరుగయింది. కాకపోతే కొంతమంది అభిమానులు గాయపడ్డారు. వారి వస్తువులు మొత్తం ఎక్కడికి అక్కడే పడిపోయాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారని” అభిమానులు పేర్కొంటున్నారు.
చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజి ఆడుతున్న నేపథ్యంలో.. అతడిని చూడడానికి ప్రేక్షకులు భారీగా వచ్చారు.. దీంతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఒకానొక దశలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. #ViratKohli #Delhistadium #Ranjicricket #Delhivsrailways pic.twitter.com/CctzpoyvOG
— Anabothula Bhaskar (@AnabothulaB) January 30, 2025