https://oktelugu.com/

H1B Visa: హెచ్ 1 బీ వీసా “ఒప్పంద పని పత్రంతో నడిచే బానిసత్వం”.. ఇదే జరిగితే అమెరికా స్తంభించిపోవడం ఖాయం

పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రామస్వామి 38 సంవత్సరాలకే అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తర భారత ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ మహిళను పెళ్లాడిన రామస్వామి..

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2023 / 06:40 PM IST
    Follow us on

    H1B Visa: అమెరికాలో డాలర్లు పండుతాయి కాబట్టి.. డాలర్ మన కరెన్సీ తో పోల్చితే చాలా విలువ కలది కాబట్టి.. మనవాళ్లు ఎక్కువగా ఆ శ్వేత దేశం వెళ్లాలి అనుకుంటారు. అక్కడ పని చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. చదువు మాత్రమే కాకుండా కొలువు చేసేందుకు కూడా ఇష్టపడేది అందుకే. అయితే అమెరికాలో తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు పాటు పని చేసేందుకు, నివాసం ఉండేందుకు హెచ్1_బీ వీసా వీలు కల్పిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీసాలను తాను అధ్యక్షుడయిన తర్వాత రద్దు చేస్తానని వివేక్ రామస్వామి చెబుతున్నాడు. వాస్తవానికి ఇది ఎంతో సాహసంతో కూడిన నిర్ణయం. మాట్లాడటం వల్లే మాజీ అధ్యక్షుడు ట్రంప్ మంది అభిమానులను చూడగొనగలిగాడు. ఇండియాలో ఇప్పుడు ఓ సెక్షన్ పట్ల వ్యతిరేకత ఎలా ఓట్లు తెచ్చి పెడుతుందో.. అదే తీరున అమెరికాలో వలస వచ్చే ఇమిగ్రెంట్లను కట్టడి చేస్తామని నేతలకు విపరీతమైన జనాదరణ ఉంటుంది.

    వాస్తవానికి ఇలాంటి ధోరణి అమెరికా ప్రయోజనాలకు నష్టమని చాలా మంది అమెరికన్ పౌరులకు తెలుసు. 2024 అమెరికా అధ్యక్షునికల్లో పోటీ చేయడానికి మితవాద రిపబ్లిక్ అండ్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఈ బయోటెక్నాలజీ మిలియనీర్ రామస్వామి ఇప్పటికే తన ఎన్నికల హామీలతో అలజడి సృష్టిస్తున్నారు. ఇటీవల అమెరికా న్యూస్ వెబ్ సైట్ పొలిటికో కు ఇంటర్వ్యూ ఇచ్చారు.” అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో చేయడం కూలి ఒప్పంద పత్రంతో బానిసత్వం చేయడమే” అని రామస్వామీ వ్యాఖ్యానించారు. తాను అమెరికా అధ్యక్షుడిని అయితే హెచ్1బీ వ్యవస్థను మురికి కాలులో పడేస్తానని రామస్వామి ప్రకటించారు. తాను కూడా తన బయోటెక్ ఫార్మా కంపెనీ కోసం సిబ్బందిని ఇతర దేశాల నుంచి రప్పించేందుకు హెచ్1 బీ వీసాల కోసం దరఖాస్తు చేసే వాటిని అవసరమైన సంఖ్యలో పొందాలని ఆయన వివరించారు. అతిబ ఆధారంగా కాకుండా లాటరీ పద్ధతి ద్వారా వీసాలు ఇవ్వడం అత్యంత దిగజారుడు తనమని రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    పాలక్కాడ్ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రామస్వామి 38 సంవత్సరాలకే అధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తర భారత ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ మహిళను పెళ్లాడిన రామస్వామి.. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. భారత కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్, నటిమణులు విద్యాబాలన్, ప్రియమణి కూడా పాలక్కాడ్ బ్రాహ్మణులే. ” పాలక్కాడ్ బ్రాహ్మణులు అయితే వంటలు లేకుంటే జిత్తుల మారి దొంగలు అయి ఉంటారని” రామస్వామి ఒక ఇంటర్వ్యూలో చమత్కరించారు. “రామస్వామి మాటలు విన్నాక కేరళ పాలక్కాడ్ బ్రాహ్మణులు నిర్మల్ మాటగా మాట్లాడతారని, తెలుగు బ్రాహ్మణులతో పోల్చితే చానా బాగా మాట్లాడతారని” అమెరికాలో స్థిరపడిన భారతీయులు వ్యాఖ్యానిస్తున్నారు.

    ఇమిగ్రేషన్, జాతి ఆధారంగా కోటాలు వంటి వివాదాస్పద అంశాలపై డోనాల్డ్ ట్రంప్ కు ఉన్న అభిప్రాయాలు ఇతడికి(వివేక్ రామస్వామి) కూడా ఉన్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కే అవకాశం లేకున్నప్పటికీ ట్రంప్ జీవోపీ క్యాండిడేట్ అయినప్పుడు తాను ఆయనకు రన్నింగ్ మెట్ (ఉపాధ్యక్షుడు) గా అయితే చాలు అనేది రామస్వామి కోరిక అని తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షురాలు గా ఉన్న కమల కూడా సగం తమిళ బ్రాహ్మణ మహిళ అనే విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే అమెరికాలో తెలుగు వారి కంటే తమిళులకే ఎక్కువ బ్రాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది.