Vishu Festival : అమెరికాలో మలయాళీ సంప్రదాయం వెల్లివిరిసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తన ఇంటిలో విషు పండుగను ఘనంగా జరుపుకున్నారు. అరటి ఆకుల్లో వడ్డించిన రుచికరమైన విషు సద్య(విందు భోజనం) అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోను ఆమె X (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు.”అందరికీ విషు శుభాకాంక్షలు. @iqbaldhali, నేను @AmbVMKwatra @kanshula, కుటుంబ సభ్యుల కోసం విషు సద్య (సాంప్రదాయ విందు) ఏర్పాటు చేశాము. అందరికీ మలయాళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని గీతా గోపీనాథ్ ట్వీట్ చేశారు.
Also Read : బాబాసాహెబ్ అంబేడ్కర్.. కులవివక్ష నుంచి రాజ్యాంగ రూపశిల్పి వరకు..!
ఈ ఫోటోలో గీతా గోపీనాథ్, ఆమె భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్, అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వత్రా, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అన్షులా కాంత్, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అరటి ఆకుల్లో వడ్డించిన రుచికరమైన విషు సద్య ఈ ఫోటోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విందులో పాల్గొన్న వారంతా అరటి ఆకుల్లో భోజనం చేయడం విశేషం.
ఇక్బాల్ సింగ్ ధాలివాల్ ఎవరు?:
గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ ధాలివాల్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లోని ఆర్థికశాస్త్ర విభాగంలో ఉన్న J-PAL (అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్) గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీరు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సహవిద్యార్థులు. వీరి కుమారుడు రోహిల్‌తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రశంసలు
గీతా గోపీనాథ్ పోస్ట్ 34,000 వ్యూస్ దాటింది. సోషల్ మీడియా నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు.”సంప్రదాయ అరటి ఆకుల్లో హృదయాలను కలిపే ఈ అందమైన విషు సద్యను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ వేడుక మలయాళీ నూతన సంవత్సర ఆనందంతో నిండి ఉంది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. “విషు శుభాకాంక్షలు గీతా! ఇది చాలా అందమైన సాంప్రదాయ విషు సద్య” అని మరొక నెటిజన్ రాశారు. “మీరు దక్షిణ భారతీయ సంప్రదాయ భోజనాన్ని ఎంత చక్కగా కొనసాగిస్తున్నారో చూడటం ఆనందంగా ఉంది. విషు శుభాకాంక్షలు!” అని మరొకరు వ్యాఖ్యానించారు.
మేష సంక్రాంతి రోజున జరుపుకునే విషు పండుగ మలయాళీ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది కేరళలోని ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. ఈ పండుగను కృష్ణుడికి అంకితం చేస్తారు. విషు కణి (శుభ దృష్టి), విషు కైనీట్టం (డబ్బు బహుమతి), విషుఫలం (సంవత్సరానికి జ్యోతిష్య భవిష్యత్తు) వంటి ఆచారాలతో ఈ పండుగను జరుపుకుంటారు.
Happy Vishu . @iqbaldhali and I enjoyed hosting a Vishu sadya (the traditional spread) for @AmbVMKwatra , @kanshula and families. Wishing everyone a happy malayali new year. pic.twitter.com/epIEV1j13Y
— Gita Gopinath (@GitaGopinath) April 14, 2025