Virus in Russia : రష్యాలో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంతుచిక్కని వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర దగ్గుతో రక్తం కక్కుతున్నారని, కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తున్నప్పటికీ ఇది కొత్త రకం వైరస్ కావచ్చని నివేదికలు సూచించాయి. అయితే, రష్యా(Russa) అధికారులు ఈ కథనాలను తోసిపుచ్చారు, దేశంలో ఎలాంటి కొత్త వైరస్ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. మార్చి 29 నుంచి ఈ మిస్టరీ వైరస్ గురించి నివేదికలు వెలువడ్డాయి. అలెగ్జాండ్రా(Alegzandra) అనే మహిళ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ, దగ్గుతున్నప్పుడు రక్తం కనిపించినట్లు తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి. రష్యాలోని పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం(Fevar), ఒళ్లు నొప్పులు(Body Pains), తీవ్ర దగ్గుతో ఇబ్బంది పడుతున్నారని, మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది.
Also Read : జపాన్‌కు భూకంప భయం.. ప్రమాదంలో 3 లక్షల ప్రాణాలు..!
సోషల్ మీడియాలో పోస్టులు..
సోషల్ మీడియా(Social Media)లో కొందరు నెటిజన్లు తాము కూడా రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు, కోవిడ్ పరీక్షలు నెగెటివ్ వచ్చినప్పటికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వైరస్ గురించి తీవ్ర చర్చ జరిగింది. అయితే, రష్యా అధికారులు ఈ వార్తలను ఖండిస్తూ, తమ పరీక్షల్లో ఎలాంటి కొత్త వ్యాధికారకాలు గుర్తించలేదని, వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆధారాలు లేవని వెల్లడించారు. అలెగ్జాండ్రాకు నిర్వహించిన పరీక్షల్లో మైకోప్లాస్మా న్యుమోనియా అనే బ్యాక్టీరియా సోకినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కోవిడ్ తరహా వైరస్ వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు భరోసా ఇచ్చారు. ఇంతలో, ఈ వైరస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జాగ్రత్తలు:
మాస్క్ ధరించడం: బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా జనసమూహంలో ఉన్నప్పుడు మాస్క్ ఉపయోగించండి. ఇది గాలి ద్వారా వ్యాపించే సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కల్పిస్తుంది.
చేతుల శుభ్రత: తరచూ చేతులను సబ్బుతో కడగడం లేదా శానిటైజర్ వాడడం ద్వారా సోంకు వ్యాప్తిని నివారించవచ్చు.
సామాజిక దూరం: ఇతరులతో కనీసం 1–2 మీటర్ల దూరం పాతుంచండి, ముఖ్యంగా జనసమూహంలో లేదా రద్దీ ప్రాంతాల్లో.
రద్దీని తప్పించడం: అనవసరంగా బయటకు వెళ్లడం మానుకోండి, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి.
ఆరోగ్య పర్యవేక్షణ: జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
నివారణ చర్యలు:
వ్యక్తిగత రక్షణ: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం (విటమిన్ సి, డి ఉన్న పండ్లు, కూరగాయలు) తీసుకోండి.
వైద్య సలహా: లక్షణాలు తీవ్రమైతే, వైద్యుల సూచనల ప్రకారం యాంటీబయాటిక్స్ లేదా ఇతర చికిత్సలు పొందండి. (ఉదాహరణకు, మైకోప్లాస్మా న్యుమోనియా బ్యాక్టీరియా వల్ల వస్తే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి.)
A mystery outbreak causing patients to cough up blood and suffer from a prolonged high fever has been reported in Russia, sparking fears of a new pandemic. However, Russian authorities have denied claims of an unidentified virus and have not disclosed the number of infections… pic.twitter.com/B03IPo3kPG
— Press review and more ️ (@EUFreeCitizen) April 1, 2025