https://oktelugu.com/

Russia vs Ukraine : రష్యా గర్జించింది.. మానవజాతి చరిత్రలో ఉపయోగించని ఆయుధాలతో ఉక్రెయిన్ పై దాడి… వీడియో వైరల్

మొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అండ చూసుకొని ఖండాంతర క్షిపణులను రష్యా మీదికి ఉక్రెయిన్ ప్రయోగించింది. ఒక్కరోజు ఓపిక పట్టిన రష్యా కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఉక్రెయిన్ దాడికి రష్యా ఏకంగా న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వాటికి బదులుగా రష్యా సరికొత్త విధానంలో దాడి చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2024 / 09:46 PM IST

    Russia vs Ukraine

    Follow us on

    Russia vs Ukraine : ఉక్రెయిన్ పై రష్యా ఖండాంతర క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ కు మాత్రమే కాకుండా పాశ్చాత్య దేశాలకు రష్యా గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా ICBM తో దాడులు చేసింది. ICBM అనే వాటిని ఒక దేశం యుద్దక్షేత్రంలో ప్రయోగించడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి. ICBM న్యూక్లియర్ వాటర్ హెడ్ లను మోసుకెళ్తాయి. రష్యా వీటిని ప్రయోగించడంతో ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి. ఉక్రెయిన్ అమెరికా, బ్రిటన్ అండ చూసుకొని రష్యా మీదికి మిస్సైళ్లు ప్రయోగిస్తే ఫలితం వేరే విధంగా ఉంటుందని ప్రపంచ దేశాలు అధినేతలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ దేశానికి తెరవెనక అండదండలు అందిస్తున్నారని పాశ్చాత్య దేశాలలోని ఓ వర్గం మీడియా కథనాలను ప్రచురిస్తోంది..” బైడన్ ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు. తన పార్టీ అభ్యర్థి కమల అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన పరాభవంతో కృంగిపోతున్నారు. అందువల్లే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అతడు ఇలాంటి పనులు చేస్తే చరిత్ర క్షమించదు. అమెరికా చరిత్రలోనే అత్యంత హీనమైన అధ్యక్షుడిగా మిగిలిపోతారని” పాశ్చాత్య దేశాలలోని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

    రష్యా దాడితో ఏం జరుగుతుంది?

    మానవ చరిత్రలో తొలిసారిగా రష్యా ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. ఈ క్షిపణి డెనిపర్ నగరంలో పడింది.. అయితే ఈ రకమైన క్షిపణిని ప్రయోగించారు రష మాత్రం ఇంతవరకు చెప్పలేదు. క్షిపణి మాత్రమే కాకుండా ఎక్స్ 47 ఎం 2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించింది. రష్యా ప్రయోగించిన ఐసీబీఎం క్షిపణిని దీర్ఘ శ్రేణి ఆయుధంగా యుద్ధ నిపుణులు పరిగణిస్తారు. ఇది 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదించగలుగుతుంది. ఈ క్షిపణిని సిలోస్ (భూగర్భంలో ఏర్పాటు చేస్తారు) లేదా మొబైల్ వాహనాల నుంచి ప్రయోగిస్తారు. సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు రష్యా తొలిసారి 1957 లో దీనిని ప్రయోగించింది. 1959లో అమెరికా ప్రయోగించింది. మొదట్లో దీనిని 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేదించడానికి ఉపయోగించేవారు. ఇక ఇటీవల బైడన్ ప్రభుత్వం రష్యా భూభాగం పైకి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ దేశానికి దీర్ఘకాలిక క్షిపణులు అందించింది. అయితే ఈ నిర్ణయం పై రష్యా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించాడు. ఉక్రెయిన్ పై న్యూక్లియర్ అటాక్ చేయడానికి సంతకం కూడా చేశాడు. అంతేకాదు యుద్ధంలో ఉక్రెయిన్ దేశానికి సహకరించే దేశాలను తమ ప్రత్యర్థులుగానే భావిస్తామని పుతిన్ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశాడు. ఈ క్రమంలోనే కీవ్ ప్రాంతంలో అమెరికా, ఇతర దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసివేశాయి.