Pawan Kalyan-Balakrishna combination : టాలీవుడ్ లో అత్యధికంగా క్రేజీ కాంబినేషన్స్ ని మిస్ చేసుకున్న హీరోలలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన వదిలేసుకున్న సినిమాలు వేరే హీరోలు చేసి ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు, సూపర్ స్టార్స్ అయ్యారు. అలా ఆయన మిస్ చేసుకున్న వాటిల్లో కొన్ని క్రేజీ మల్టీస్టార్రర్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో బాలయ్య తో కలిసి చెయ్యాల్సిన సినిమా కూడా ఒకటి ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2014 వ సంవత్సరంలో తమిళ హీరో విజయ్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్ లో ‘జిల్లా’ అనే చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఆరోజుల్లోనే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకి పోటీగా, అజిత్ ‘వీరం’ చిత్రం కూడా విడుదలైంది. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి.
అయితే జిల్లా చిత్రాన్ని తెలుగు లో పవన్ కళ్యాణ్ ని హీరో గా పెట్టి చేయాలని అనుకున్నాడు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం. ‘జిల్లా’ కి దర్శకత్వం వహించిన ఆర్తీ నేసన్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యాడు. అప్పట్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మోహన్ లాల్ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ ని తీసుకుంటున్నారని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎందుకో ఈ సినిమా కార్య రూపం దాల్చలేదు. ఈ చిత్రానికి బదులుగా పవన్ కళ్యాణ్ ‘వీరం’ చిత్రాన్ని ‘కాటమరాయుడు’ గా రీమేక్ చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది. కానీ బాలయ్య తో కలిసి జిల్లా చిత్రాన్ని రీమేక్ చేసి ఉండుంటే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయ్యేవి అని ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు బాధపడుతున్నారు.
సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా, కేవలం ఈ కాంబినేషన్ కోసం థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ తోనే సూపర్ హిట్ అయ్యేదని, మంచి అవకాశం చేజారిపోయింది అభిమానులు బాధపడుతున్నారు. భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ ఉంటుందో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్న ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’,’ఓజీ’ చిత్రాలను పూర్తి చేయడానికి సిద్దమయ్యాడు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్, ఎల్లుండి నుండి కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ సినిమాని గ్రాండ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.