USA Green Card : అగ్రరాజ్యాం అమెరికాకు భారత్‌తోపాటు వివిధ దేశాల నుంచి విద్య, ఉద్యోగాల కోసం వలస వస్తుంటారు. చాలా మంది అక్కడే ఎక్కువ కాలం ఉండి గ్రీన్‌కార్డుకు అర్హత సాధిస్తున్నారు. అక్కడే స్థిరపడేందుకు యత్నిస్తున్నారు. కొందరు గ్రీన్‌కార్డు కాల పరిమితి ముగిశాక స్వదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు గ్రీన్ కార్డు గడువు పొడగించుకుని మరీ ఉంటున్నారు. గ్రీన్‌కార్డుదారులకు అమెరికా పౌరసత్వంతోపాటు అక్కడి పౌరులకు లభించే అన్ని హక్కులు పొందుతారు. తాజాగా గ్రీన్‌కార్డు గడువు ముగిసిన వారికి బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శాశ్వత నివాసం పొందుతున్న పర్మినెంట్ రెసిడెంట్ కార్డుల వ్యాలిడిటీని మరింత పొడిగింది. గతంలో గ్రీన్‌కార్డు తీసుకుని గడువు ముగిసిన వారు మరో 24 నెలలు అమెరికాలో ఉండే అవకాశం కల్పించేవారు. దానిని బైడెన్ ప్రభుత్వం 36 నెలలకు పెంచినేట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ వెల్లడించింది. దీంతో గ్రీన్‌కార్డు రెన్యూవస్ కోసం చూస్తున్నవారికి ఊరట లభించింది.
ఐదేళ్లకోసారి రెన్యూవల్..
సాధారణంగా అమెరికాలో గ్రీన్‌కార్డు పొందినవారు ప్రతీ ఐదేళ్లు్క ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఇందుకోసం కార్డు గడువు తీరిపోయే కాలానికి ఆరు నెలల ముందే ఐ–90 ఫాం సమర్పించాలి. రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్న వారి కార్డు వ్యాలిడిటీని 24 నెలలు పొడిగిస్తూ రిసీట్ నోటీసు ఇస్తారు. దీంతో కార్డు గడువు తీరినా రిసీట్ నోటీసుతో చట్టబద్ధమైన నివాస హోదా కొనసాగించవచ్చు. కొత్త కార్డు జారీ అయ్యే వరకూ దీనిని ప్రూఫ్‌గా వినియోగిస్తారు.
36 నెలలకు పెంపు…
తాజాగ ఆగ్రీన్‌కార్డు అదనపు వ్యాలిడిటీ గడువును 36 నెలలకు పెంచుతూ బైడెన్ ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం వేచిచూసే వారు మరింతకాలం చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదాలో కొనసాగే వీలు ఉంటుంది. ఇక కంండీషనల్ రెసిడెన్సీ తీసుకునేవారి గ్రీన్‌కార్డుల గడువు రెండేళ్లే ఉంటుంది. వీరికి పొడిగింపు వర్తించదు. నివాస హోదాపై ఉన్న కండీషన్ తొలగించుకుంనేందుకు దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగిసే 90 రోజుల్లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు అనుమతి పొందితే పదేళ్లు చెల్లుబాటు అయ్యేలా గ్రీన్‌కార్డు ఇస్తారు.