US Presidential Election : అగ్రరాజ్యాం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. రోజు రోజుకు ఎన్నికల రేసు సరవత్తరంగా మారుతోంది. ప్రధాన పోటీ అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్యనే నెలకొంది. గెలుపు కోసం ఇద్దరూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒటరునాడి ఎటువైపు ఉంది అని తెలుసుకునేందుకు మీడియా సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ఒకసారి హారిస్‌వైపు, మరోసారి ట్రంప్ వైపు అంచనాలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో గెలుపు ఎవరిది.. వైట్‌హౌస్‌లో పీఠం ఎవరికి దక్కుతుంది అని తేల్చలేకపోతున్నాయి. తాజాగా అసోసియేటెడ్‌ఫ్రెస్ – ఎన్‌వోఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇద్దరికీ ఒకస్థాయిలో ఆదరణ ఉంది. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. ఆర్థిక అంశంతోపాటు పలు కీలకరంగాలను సమర్థవంతంగా నిర్వహించే విషయంలో ఇద్దరికీ ఒకేరకమైన మార్కులు వచ్చాయి. మొన్నటి వరకు ముందంజలో ఉనన ట్రంప్‌కు ఇది కాస్త ఇబ్బందికరమనే చెప్పాలి.
ఉత్తములకే మా ఓటు
తాజా సర్వేలో 1,771 మంది రిసిజ్టర్ ఓటర్ల మనోగతాన్ని తెలుసుకున్నారు. ఇందులో పది మందిలో నలుగురు ట్రంప్ అమెరికా అర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించగలడని అభిప్రాయపడ్డారు. కమలా హారిస్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దగలదని అంతేమంది తెలిపారు. మిగిలినవారిలో ఒకరు ఇద్దరినీ విశ్వసించడం లేదని చెప్పారు.మరొకరు ఇద్దరికీ మద్దతు ఇచ్చారు. ఇది ఒక రకంగా ట్రంప్‌కు హెచ్చరికే. బైడెన్ దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించడంలేదని, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌కు భాగం ఉందని ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రజల్లో మాత్రం అంచనాలు వేరుగా ఉన్నాయి. బైడెన్ వైఫల్యాలు తనపై పడకుండా కమలా హారిస్ చూసుకోగలుగుతున్నారు.
పన్నుల విషయంలో..
ఇక సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా వృద్ధి వస్తుందని ట్రంప్ అంటున్నారు. పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంటున్నారు. 20 శాతం యూనివర్సల్ టారిఫ్ ద్వారా ఇచ్చే నిధులు దేశంలో పరిశ్రమల నిర్మాణానికి ఊతం ఇస్తాయని చెబుతున్నారు. కమలా హారిస్ మాత్రం దీనికి విరుద్ధంగా చెబుతున్నారు. పన్ను విధించడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు నిధులు సమకూరి మరిన్ని ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఖర్చులు అదుపులో ఉంచడానికి, వృద్ధి రేటు పెరగడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
ద్రవ్యోల్బణం కీలకం..
ఇక అమెరికాలో 2022లో ద్రవ్యోల్బనం నాలుగు దశాబ్దాల గరిష్టానిక ఇచేరింది. దాని ప్రభావం ప్రజలపై పడింది. నిత్యావసర ధరలపై సామాన్యులు ఆందోళన చెందుతన్నారు. అధిక వడ్డీ రేట్లు, మోటారు వాహనాల కొనుగోలుదారులను కుంగదీశాయి. తగ్గిన నిరుద్యోగం, స్టాక్ మార్కెట్లలో పెరిగిన లాభాలకన్నా ద్రవ్యోల్బణం పెరుగుదలనే చాలా మంది పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనిని కట్టడి చేసే నేతకు పట్టం కడతామంటున్నారు.