PM Narendra Modi : అమెరికా అధ్యక్షతన నిర్విహిస్తున్న క్యాడ్ సమావేశానికి రావాలని అగ్రరాజ్యం అమెరికా ఇటీవలే బారత ప్రధాని మోదీని ఆహ్వానించింది. ఈమేరకు ప్రధాని శనివారం తెల్లవారుజామున అమెరికా బయల్దేరి వెళ్లారు.మూడు రోజులపాటు ఆయన అమెరికాలో ఉంటారు. తొలిరోజు అమెరికా, ఆస్ట్రేలియ, జపాన్, భారత్ సభ్య దేశాలుగా ఉన్న క్యాడ్ సమావేశంలో పాల్గొంటారు ఆసియా పసిఫిక్ అంశాలపై మోదీ ప్రసంగిస్తారు. ఐక్యరాజ్యసమితి జనరల్ సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు. వందకుపైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. తర్వాత పలు కంపెనీల సీఈవోలతో సమావేశం ఉంటుంది. అయితే.. న్యూయార్క్‌లో ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ ఓ గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మోదీ – యూఎస్‌ఏ ప్రోగ్రెస్ టుగెదర్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈమేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నసాపు వెటరన్స్ మెమోరియల్ కోలిజియం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి 14 వేల మంది హాజరవుతారని తెలుస్తోంది. భారీగా సెలబ్రిటీలు హాజరవుతారని సమాచారం. 500 మంది కళాకారులు, 350 మంది వలంటీర్లు, 85 మీడియా సంస్థలు, 40కిపైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
రెండు వేదికలు..
ఈ కార్యక్రమంలో ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిసన్ కార్యక్రమ ం నిర్వహిస్తామని ఈవెంట్ కీలక నిర్వాహకుడు సుహాగ్ శుక్లా తెలిపారు. ఇందుకోసం రెండు వేదికలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రధాన వేదికపై గ్రామీ అవార్డు నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది జాతీయ, అంతర్జాతీయ కలాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. ఇక మరో వేదిౖకపై 117 మంది కళాకారులు విశిష్ట 6పదర్శనలతో కోలిజియంలోకి వచ్చే అతిథులను అలరిస్తారు. 30కిపైగా శాస్త్రీయ, ఆధునిక ఫ్యూజన్ ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
2014లో తొలిసారి..
ఇదిలా ఉంటే.. మోదీ ప్రధానిగా తొలిసారి ప్రమాణం చేసిన తర్వాత 2014లో న్యూయార్క్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 2019లో ఎక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఉన్న ఐదానంలో మెగా కమ్యూనిటీ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనూ మోదీ పాల్గొన్నారు. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మోదీతో కలిసి ఈవెంట్‌కు హాజరయ్యారు.