https://oktelugu.com/

Nikhil : నిఖిల్ ఫేమ్ తగ్గిపోయిందా? కథ నచ్చలేదా? సినిమా ఏంటి ఇలా వచ్చేసింది?

స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలు చూశారా? ఇవి మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి. మీకు ఈ రెండు సినిమాల పేరు ఎందుకు ప్రస్తావించానో అర్థం అయింది కదా.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 27, 2024 / 11:20 AM IST

    Nikhil

    Follow us on

    Nikhil : స్వామి రారా’, ‘కేశవ’ సినిమాలు చూశారా? ఇవి మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి. మీకు ఈ రెండు సినిమాల పేరు ఎందుకు ప్రస్తావించానో అర్థం అయింది కదా. ఎందుకంటే ఈ సినిమాలతో సూపర్ హిట్ కాంబోగా నిఖిల్- సుధీర్ వర్మ మంచి పేరు సంపాదించారు. మరోసారి అదే కాంబోతో వచ్చిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. మరి వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను సంపాదించాయి. సో అదే రేంజ్ కూడా మూడవ సినిమా ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా థియేటర్ లలో ప్రేక్షకుల ముందు దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారి నిఖిల్ అభిమానులు షాక్ అయ్యారు.

    థియేటర్ లలో ఎలాగైతే సైలెంట్ గా విడుదల అయిందో అదే విధంగా ఓటీటీలో కూడా రిలీజ్ అయింది ఈ అప్పుడో ఇప్పుడూ ఎప్పుడో సినిమా. ఇందులో నిఖిల్ హీరోగా నటించారు. స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ద‌క్కించుకున్న రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా మెప్పించింది. కరోనా కాలంలో పట్టాలెక్కింది ఈ మూవీ. అప్పటి నుంచ ఎన్నో అవాంతరాలు దాటి నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ఆడియెన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో నిఖిల్ అభిమానులు నిరాశ చెందారు.

    మేబీ ప్రమోషన్ చేయలేదా? లేదంటే కథ సింపుల్ గా ఉందా? నిఖిల్ బోర్ కొట్టాడా తెలియదు కానీ మొత్తం మీద ఈ సినిమాకు మాత్రం హిట్ ను ఇవ్వలేకోపోయారు నెటజన్లు. నిఖిల్-రుక్మిణీల జోడీకి మంచి పేరు వచ్చింది. కానీ ఇందులోని కథమాత్రం పెద్దగా ఆకట్టుకునే మాదిరి లేదు. అందుకే ఆడియెన్స్ పెదవి విరిచారు. ఫలితంగా స్పై సినిమా తర్వాత నిఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి పడనట్టుగా అయింది. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశ పర్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా సడెన్ గా ఓటీటీలో కూడా దర్శనం ఇచ్చింది.

    అమెజాన్ ప్రైమ్ వీడియో ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 27) అర్ధరాత్రి నుంచే నిఖిల్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

    గతంలో డార్లింగ్, అత్తారింటికి దారేది ,ఛ‌త్ర‌ప‌తి, వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లాంటి సినిమాలను నిర్మించారు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడ‌క్ష‌న్స్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్. వారే ఈ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నిర్మించారు. నిఖిల్, రుక్మిణీలతో పాటు మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించారు ఇక వైవా హర్ష, జాన్ విజయ్, అజయ్, సత్య, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సంగీతం అందించగా, సన్నీ.ఎం.ఆర్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ అందించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో ఒక్కసారి చూసేయవచ్చు.