US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం మొదలైంది. మంగళవారం(నవంబర్ 5) పోలింగ్ జరిగింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం తెల్లవార జాము వరకు పోలింగ్ జరిగింది. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగానే.. మరోవైపు పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో కౌటింగ్ కూడా మొదలు పెట్టారు. ఇక అధ్యక్ష ఎన్నికలపై ఇప్పటికే పలు సర్వే సంస్థలు ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని వెల్లడించాయి. ఓటింగ్ సరళి చూస్తే కూడా ట్రంప్, హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంగా ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కనీసం 270 ఎలక్టోర్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా. అదే జరిగితే అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్‌పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశం జరుగుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26 కన్నా ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షలు అవుతారు.
రెండు శతాబ్దాల క్రితం..
చివరి సారిగా 1800 సవంత్సరంలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలో దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ప్రదినిధుల సభ ఓటింగ్ జరుపగా జెఫర్సన్ విజేతగా నిలిచారు. ఇక 2020లో అధ్యక్ష ఎన్నిలక పోలింగ్‌లో 66 శాతం మాత్రమే నమోదైంది. ఈసారి 24.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16.14 మంఇ మాత్రమే నమోదు చేసుకున్నారు. వీరు 2020 కన్నా కూడా తక్కువ. 2020లో 15.9 కోట్ల మంది మాక్షతమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా సాగుతోంది.
ట్రంప్ ఆధిక్యం..
ఇక తాజాగా పరిస్థితి చూస్తే. ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు రియల్ క్లియర్ పోలింగ్ సైట్ తెలిపింది. పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ 219, కమలా హారిస్ 211 ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది. ఇక స్వింగ్ స్టేట్స్ అయిన నార్త్ కరోలినా, జార్జియా, నవెడా. మిచ్‌గార్, ఆరిజోనా, విస్కన్సిన్, మిషిగాన్‌లో 108 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఓట్లే కీలకం కానున్నాయి.