2024 united states elections : హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. దూకుడు కొనసాగిస్తున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పోరా హోరీగా సాగుతున్నాయి. ఎన్నికల్లో ట్రంప్ దూసుకుపోతున్నారు. కమలా హ్యారీస్, ట్రంప్ మధ్య పోరు ఉత్కంఠ గా సాగుతోంది. పోలింగ్ ఓ వైపు కొనసాగుతుండగానే.. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు.

Written By: NARESH, Updated On : November 6, 2024 9:00 am

2024 united states elections

Follow us on

2024 united states elections : మన కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:30 వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన కేంద్రాలలో లెక్కింపు మొదలుపెట్టారు. ఉదయం 7 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ సాగగా.. ఇప్పటివరకు ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. ట్రంప్ ప్రస్తుతానికి 10 రాష్ట్రాలలో గెలుపును సొంతం చేసుకున్నారు.. ఒక్ల హమా, సౌత్ కరోలినా, మిస్సౌరి, వెస్ట్ వర్జినియా, ఇండియానా, కెంటకి, ఫ్లోరిడా, మిస్సిసిపి, అలబామా, టెన్నేసి రాష్ట్రాలలో ట్రంప్ విజయాన్ని సాధించారు. ఫలితంగా ట్రంప్ కు 101 ఎలక్టోరల్ సీట్లు దక్కాయి. 8 రాష్ట్రాలలో కమల లీడ్ కొనసాగించారు. వెర్మాంట్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, మేరీ ల్యాండ్, న్యూ జెర్సీ, మసాచు సెట్స్ లో కమల విజయం సాధించారు. ఫలితంగా కమల 71 ఎలక్టోరల్ సీట్లు సాధించారు.

ట్రంప్ దానిని సాధిస్తారా..

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాలంటే బ్లూ వాల్ ను బద్దలు కొట్టాల్సిందే. అమెరికన్ పొలిటికల్ ఎక్స్ పర్ట్స్ అంచనా ప్రకారం డెమొక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలను “బ్లూ వాల్ స్టేట్స్” అని పిలుస్తుంటారు. వెర్మాంట్, డెలావర్, రోడ్ ఐలాండ్, మైనె, హవాయ్, విస్కాన్సిన్, ఓరెగావ్, మిన్నె సోటా, మిషిగన్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లి నాయిస్, మాసాచు సెట్స్, వాషింగ్టన్, మేరీ ల్యాండ్ ను బ్లూ వాల్ స్టేట్స్ అని పిలుస్తుంటారు. ఈ రాష్ట్రాల పరిధిలో 238 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలంటే 270 ఎలక్టో రల్ ఓట్లు కావాల్సి ఉంటుంది.. అయితే ఈ బ్లూ వాల్ స్టేట్ లను కమల నిలుపుకుంటే ఆమె అధ్యక్షరాలు అవుతారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడు కావాలి అనుకుంటే.. ఈ రాష్ట్రాలలో కొన్నింటినైనా ఆయన తనవైపు మళ్లించుకోవాల్సి ఉంటుంది..

డిసెంబర్ 11నే తుది ఫలితం..

అమెరికాలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. భారత్ మాదిగ ఎన్నికల కమిషన్ కూడా లేదు. అమెరికాలో ఎన్నికల నిర్వహణను రాష్ట్రాలను నిర్వహిస్తాయి. అయితే అధికారికంగా ఎన్నికల ఫలితాలు రావడానికి డిసెంబర్ 11 వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడి అయ్యేంతవరకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో.. అమెరికా, ఇతర గ్లోబల్ మీడియా సంస్థలు ఫలితాలను ముందుగానే అంచనా వేయొచ్చు. డిసెంబర్ 11 కంటే నాలుగైదు రోజుల ముందస్తు అంచనా ఫలితాలను మీడియా సంస్థలు వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. కాగా, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చరిత్రలో చూడని విధంగా సాగింది. కమల, ట్రంప్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ పలు సందర్భాల్లో కమలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆమె వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటించారు. అయినప్పటికీ ట్రంప్ ముందంజలో ఉన్నారు.