spot_img
Homeఅంతర్జాతీయంUS aircraft crashes: అమెరికా 16 విమానాలు కూలాయి.. బిల్డప్‌ ఎక్కువ కానీ బిజినెస్‌ లేదన్నమాట

US aircraft crashes: అమెరికా 16 విమానాలు కూలాయి.. బిల్డప్‌ ఎక్కువ కానీ బిజినెస్‌ లేదన్నమాట

US aircraft crashes: మాకు ఎదురు లేదు.. మా వద్ద ఉన్న ఆయుధాలు ప్రపంచంలో ఏ దేశం వద్ద లేవు.. మా టెక్నాలజీకి ఎదరు లేదు.. మా యుద్ధ విమానాలను కూల్చే సత్తా ఎవరికీ లేదు.. ఏ దేశంపైన అయినా దాడిచేసే శక్తి మా సొంతం అంటూ ఊదరగొడుతుంది అమెరికా. వెనెజువెలాలో రహస్యంగా చొరబడి అధ్యక్షుడు నికోలస్‌ మధురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేసి న్యూయార్క్‌ కోర్టులో దోషులుగా నిలబెట్టారు. దీంతో అమెరికా అçహంకారం మరింత పెరిగింది. ఆ అతివిశ్వాసంతోనే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. వెనుజువెలా తరహాలోనే ఇరాన్‌ మెడలు వంచుతామని భావించారు. కానీ, ఇరాన్‌ ప్రతిఘటనతో అమెరికా తెల్లబోతోంది. ఇరాన్‌ కొడుతున్న దెబ్బలకు అమెరికా యుద్ధ విమానాలు పండుటాకులా రాలిపోతున్నాయి. యుద్ధం మొదలై 20 రోజులు అయింది. ఈ 20 రోజుల్లో అమెరికా ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా 16 యుద్ధ విమానాలను కోల్పోయింది.

16 యుద్ధ విమానాలు ఇవీ..
ఇరాన్‌ దాడిచేసి కూల్చిన అమెరికా 16 యుద్ధ విమానాలు ఇలా ఉన్నాయి. పది MQ–9 రీపర్‌ డ్రోన్‌లు శత్రు రక్షణ వ్యవస్థల ద్వారా గాలిలోనే కూలిపోయాయి. మిగిలినవి యుద్ధ చర్యల్లో లేదా సంబంధిత ప్రమాదాలతో నష్టపోయాయి. బ్లూమ్బర్గ్‌ కథనం ఈ గణాంకాలను ప్రస్తావించి అమెరికా వ్యూహాల్లో లోపాలను సూచించింది. ఇక కువైట్‌పై ఇరాన్‌ జరిపిన దాడిలో మూడు ఎఫ్‌–15 ఫైటర్‌ జెట్‌లు కూలిపోయాయి. తాజాగా రెండు ఎఫ్‌ – 35 విమానాలను ఇరాన్‌ కూల్చింది. మరోవైపు ఓ యుద్ధ నౌక దాడితో దెబ్బతిని యుద్ధం నుంచి తప్పుకుంది.

ఇరాక్, సౌదీలో రీఫ్యూయలింగ్‌ విమానాలు..
ఇరాక్‌లో కేసీ–135 రీఫ్యూయలింగ్‌ విమానం కుప్పకూలడంతో ఆరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియా వైమానిక స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడిలో ఐదు కేసీ–135లు దెబ్బతిన్నాయి. ఈ విమానాలు దీర్ఘ దూర ప్రయాణాలకు కీలకమైనా, రక్షణ బలహీనతలు బయటపడ్డాయి.

MQ–9 రీపర్‌ డ్రోన్‌ల పరమైన నష్టాలు
ఇరాన్‌ ఆధునిక రాడార్లు, క్షిపణులతో 9 రీపర్‌ డ్రోన్‌లను గాలిలో ధ్వంసం చేసింది. జోర్డాన్‌ విమానాశ్రయంలో బాలిస్టిక్‌ క్షిపణి ఒక డ్రోన్‌ను నేలపై పేల్చింది. మరో రెండు ప్రమాదాల్లో కూడా రీపర్‌లు పోగొట్టాయి. తక్కువ ధర (30 మిలియన్‌ డాలర్లు్ల), పైలట్‌ లేకపోవడం వల్ల ఈ మానవరహిత వాహనాలు విజయవంతం అవుతున్నాయి.

ఈ పతనాలు అమెరికాకు ఆర్థిక భారాన్ని (200 మిలియన్‌ డాలర్లు) పెంచుతున్నాయి. ఇరాన్‌ స్వీయ డ్రోన్‌లు, క్షిపణులతో సమతుల్యం చేసుకుంటోంది. స్నేహపూర్వక అగ్ని, సమన్వయ లోపాలు యుద్ధాన్ని దీర్ఘకాలికంగా మార్చుతున్నాయి. ప్రపంచ చమురు ధరల పెరుగుదలకు ఈ సంఘర్షణ కారణమవుతోంది. భవిష్యత్తులో అమెరికా కొత్త వ్యూహాలు రూపొందించాల్సి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper