Homeఅంతర్జాతీయంUkraine Soldiers Hunger: ఎండు డొక్కలు.. పుండు రెక్కలు.. ఉక్రెయిన్ సైనికుల పరిస్థితి ఎంత దారుణమంటే..

Ukraine Soldiers Hunger: ఎండు డొక్కలు.. పుండు రెక్కలు.. ఉక్రెయిన్ సైనికుల పరిస్థితి ఎంత దారుణమంటే..

Ukraine Soldiers Hunger: ఏ మనిషికైనా సరే పీల్చే గాలి తర్వాత.. తాగే నీటి తర్వాత అత్యంత ముఖ్యమైనది ఆహారం. ఆ జానెడు పొట్టను నింపుకోవడానికి మనిషి రకరకాల పనులు చేస్తుంటాడు.. కానీ ఆ పొట్టనిండడమే కష్టం అనుకుంటే.. పొట్ట నిండుగా ఆహారం కూడా వెళ్లే మార్గం లేకపోతే.. అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదు.

ఆదిమ కాలంలో మనుషులు ఆహారం కోసం అన్వేషణ సాగించారు. ఆ ఆహారాన్ని తమకు తాముగా సంపాదించుకున్నారు. అనేక క్రమాలుగా మనుషులుగా ఎదిగిన తర్వాత గొప్పగా జీవించడం మొదలుపెట్టారు. మనుషులు అభివృద్ధి చెందే క్రమంలో ఆలోచనలు గొప్పగా ఉండాలి.. జీవితం మరింత ఉన్నతంగా ఉండాలి. అలాకాకుండా రాతియుగంలోకి మనుషులు వెళ్లిపోయి.. దారుణమైన స్థితిలోకి మరలిపోతుంటే అంతకుమించిన తీరుగమనం మరొకటి ఏముంటుంది.

కొంతకాలంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సాగిస్తున్నాయి. రెండు వైపులా కూడా తీవ్రమైన ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం.. ఆర్థికంగా నష్టం విపరీతంగా జరిగింది. అయినప్పటికీ రెండు దేశాలు ఏమాత్రం పట్టు విడిపోవడం లేదు. పైగా మరింత దారుణంగా దాడులు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ఈ యుద్ధం వల్ల రష సాధించింది లేదు. ఉక్రెయిన్ వెనకేసుకున్నది లేదు. రెండు దేశాల సంబంధించిన అధిపతులు బాగానే ఉన్నారు.. పైగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసుకుంటున్నారు.

యుద్ధం అంటే ముందు వరుసలో ఉండి చేసేది సైనికులు మాత్రమే. ఆ సైనికుల ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపాలుగా మారిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన సైనికులు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నారు.. కనీసం వారికి తినడానికి తిండి కూడా లేదు.. గత నెల చివరిలో ఉక్రెయిన్ దేశానికి చెందిన నలుగురు సైనికులు చనిపోయారు. వారి దృశ్యాలు అత్యంత కలవరపరిచే విధంగా ఉన్నాయి.. 17 రోజులుగా సైనికులకు ఎటువంటి ఆహారం సరఫరా చేయకపోవడంతో.. సైనికులు ఆకలితో అల్మటించి చనిపోయినట్టు తెలుస్తోంది. ఆకలి తట్టుకోలేక వారు వాన నీళ్లు తాగారు. ఉక్రెయిన్ సైన్యంలో 14వ మేకనైజ్డ్ బ్రిగేడ్లో పనిచేస్తున్న సైనికుడి భర్త అనస్తాసియా సిల్చుక్ తన భర్త ఫోటోను ఏప్రిల్ 22న సోషల్ మీడియాలో బయటపెట్టింది.

రష్యా బాంబుదాడులతో ధ్వంసం చేసిన తర్వాత ఆగ్నేయ డొనేట్స్ ప్రాంతంలో ఓసికిల్ నదికి ఎడమ, తూర్పు ఒడ్డు ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్నారు. ఆహారం లేక, తాగడానికి నీరు లేక సైనికులు ఆకలి కేకలు వేశారని తెలుస్తోంది. సైనికుడు ఓలెక్సాండర్ తన మాతృభూమి కోసం పోరాడుతున్నప్పుడు తీవ్రమైన ఆకలి బాధను అనుభవించాలని ఆల్ జజీరా అనే మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పాడు. “వారాల తరబడి మీకు రోజుకు చాక్లెట్ బార్ లు, ఓట్ మీల్, వాటర్ బాటిల్ మాత్రమే లభిస్తాయి. కాబట్టి మీరు వేడి భోజనం కోసం కలలు కనకూడదు” అంటూ కీవ్ లో కాలిగాయం నుంచి కోరుకుంటున్న ఓ సైనికుడు మీడియా ఇంటర్వ్యూ లో తన బాధను వ్యక్తం చేశాడు. దీనిని బట్టి యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular