Typhoon Gaemi: ఒకవైపు భారత్‌లో అప్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతం వర్షాలకు వణుకుతోంది. ఢిల్లీ, ముంబై, పూణే నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు కూడా వరదలకు అతలాకుతలం అవుతున్నాయి. ఇలా భారత దేశంలో వర్షాకాలం వానలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో తైవాన్ సముద్రతీరంలో పుట్టిన టైపూన్ గేమీ తుపాను.. ఇప్పటికే రెండు దేశాలను అతలాకుతలం చేసింది. అల్లకల్లోలం సృష్టించింది. టైపూన్‌గేమీ కారణంగా తైవాన్, ఫిలీప్పీన్స్‌లో వరదలు ముంచెత్తాయి. తైవాన్‌లో ఇద్దరు మృతిచెందారు. ఇదిలా ఉంటే.. తుపాను నెమ్మదిగా కదులుతూ.. ఇప్పుడు సముద్ర తీరం వెంట చైనాను తాకింది. దీంతో అప్రమత్తమైన చైనా అలర్ట్ ప్రకటించింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అధికారులను అప్రమత్తం చేసింది. జూలై 24న ఏర్పడిన టైపూన్ తుపాన్ కారనంగా ఫిలిప్పీన్స్‌లోని మనీలాలోల భారీ వర్షాలు కురిశాయి. వదలు ముంచెత్తాయి. రహదారులు నీటమునిగాయి. ఇక టైపూన్ గేమీ ప్రభావంతో తైవాన్‌లో గంటకు 227 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కార్యాలయాలు, పాఠశాలలు, ఆర్థిక మార్కెట్లు రెండో రోజులు మూసివేసింది. ఇక టైపూర్ ప్రభావిత ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షాలకు 226 మంది గాయపడ్డారు. ఇద్దరు మరణించారు. వరదలతో ట్రాఫిక్ స్తంభించింది. తైవాన్, ఫిలిప్పీన్స్‌లో గేమీ తుపాన్ కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 21 మంది మరణించారు.
చైనా తీరానికి ప్రయాణం..
యిలాన్ కౌంటీలోని తైవాన్ ఈశాన్య తీరంలో గేమీ కేంద్రీకృతమై ఉంది. సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఎనిమిదేళ్లలో తైవాన్ ద్వీపాన్ని తాకిన అత్యంత బలమైన టైఫూన్ ఇదేనని ప్రకటించింది. బలహీనపడటానికి ముందు 227 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది. ఫిలిప్సీన్, తైవన్‌ను ప్రభావితం చేసిన టైపూర్ గేమీ.. సముద్ర తీరంగుండా ఇప్పుడు చైనా తీరానికి చేరుకుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే గేమీ తుఫాన్.. చైనాలో తక్కవ తీవ్రతతో ఉత్తరంవైపు కదులుతున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తరాదివైపుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫుజియాన్, జెజియాంగ్ తీర ప్రావిన్స్‌లలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండడంతో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు.
వేసవిలో భారీ వర్షాలు..
ఇదిలా ఉంటే చైనాలో ప్రస్తుతం వేసవి. దీంతో అక్కడ వేసవి తుపానులు ప్రభావితం చేస్తాయి. కానీ, భారీ వర్షాన్ని ఎదుర్కొంటోంది. చైనా రాష్ట్ర మీడియా ప్రకారం, రాజధాని బీజింగ్‌లోని అధికారులు అప్‌గ్రేడ్ చేసి, బుధవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కోసం రెడ్ అలర్ట్ జారీ చేశారు. బీజింగ్ ఫాంగ్‌షాన్ జిల్లా వాతావరణ అబ్జర్వేటరీ ఉదయం 10 గంటలకు నగరంలోని అనేక ప్రాంతాలలో ఆరు గంటల్లో 150 మి.మీల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో 200 మి,మీలకన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఆగ్నేయ చైనా ప్రావిన్స్‌లోని ఫుజియాన్‌లో నివసిస్తున్న 1,50,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర చైనాలోని అధికారులు భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడటానికి మరియు వరదలను ప్రేరేపించవచ్చని హెచ్చరించారు.