Great Places In The World: ప్రపంచ వ్యాప్తంగా దేశాలు, ప్రదేశాలు, నేరాలు, ప్రశాంతత, గ్రీనరీ, తదితర అంశాల ఆధారంగా వివిధ సంస్థలు ర్యాంకులు ఇస్తుంటాయి. వంటకాలకు కూడా ర్యాంకులు ఇస్తున్నాయి. అయితే తాజాగా టైమ్ మ్యాగజైన్(Time Magazine) 2025 కోసం గొప్ప ప్రదేశాల జాబితాను ప్రకటించింది. ఇందులో మన దేశానికి చెందిన రెండు హోటళ్లకు స్థానం దక్కింది.
Also Read: ఒక్క ఆర్డర్ తో 41దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్.. వాళ్లెవరూ అమెరికాలో అడుగు పెట్టలేరు
టైమ్ మ్యాగపైజ్ ఏటా వివిధ అంశాల ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకులు ఇస్తుంది. తాజాగా 2025 సంవత్సరానికి ‘ప్రపంచ గొప్ప ప్రదేశాల జాబితా’(Grate Places)ను ప్రకటించింది. ఈ జాబితా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రదేశాలను, అనుభవాలను హైలైట్ చేస్తుంది. ఇందులో హోటళ్లు, క్రూయిజ్‌లు, మ్యూజియంలు, పార్కులు వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్‌లోని రెండు హోటళ్లు(Two Hottels) ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. జైపూర్‌లోని రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్ బస చేయడానికి అనువైన స్థలాల విభాగంలో స్థానం సంపాదించాయి. అదే విధంగా, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్ సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో చేరింది.
రాఫిల్స్ హోటల్..
రాఫిల్స్ హోటల్(Rawfills Hotle)జైపూర్ సమీపంలోని కుకాస్ పట్టణంలో ఉంది. ఇది రాజభవన శైలిలో నిర్మితమైన హోటల్‌గా పేరుగాంచింది. ఈ 50 గదుల హోటల్‌లో పాలరాయి శిల్పాలు, మొఘల్ శైలి(mogals style) తోరణాలు, చిల్లులు గల జాలీస్ స్క్రీన్‌లు, సంప్రదాయ అద్దాలు, మొజాయిక్ ఫ్లోరింగ్ వంటి అద్భుతమైన డిజైన్ ఉంది. ఇది ఒక కళాఖండంగా పరిగణించబడుతుంది.
వింధ్యవిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్
ఇక మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ సమీపంలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్ ఉంది. ఈ ప్రాంతం సఫారీలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్‌లను వాటి సహజ ఆవాసంలో చూడవచ్చు. ఈ హోటల్ అతిథులకు వన్యప్రాణులకు సంబంధించిన వివిధ అనుభవాలను అందిస్తుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ మూడు సంస్థలు భారత్‌లోని వైవిధ్యమైన సంస్కృతి, ఆతిథ్యం, ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.
Also Read: కోడిగుడ్లు కావాలి.. సాయం చేయండి ప్లీజ్.. యాచిస్తున్న అగ్రరాజ్యం!