Twitter X: మూసివేత బాటలో ట్విట్టర్ (X).. ట్రంప్ ఓడితే ఇక నిషేధమే..

రెండేళ్ల క్రితం వరకు ట్విట్టర్‌.. ఇప్పుడు ఎక్స్‌.. ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసిన అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. దానిని మూసివేసి ఎక్స్‌గా మార్చేశారు. అనేక మార్పులు చేర్పుల తర్వాత ఇప్పుడిప్పుడే కుదుట పడింది.

Written By: Raj Shekar, Updated On : September 7, 2024 4:26 pm

Twitter

Follow us on

Twitter X: ప్రపంచంలో వీవీఐపీ, వీవీఐపీ సామాజిక మాధ్యమంగా మొదలైంది ట్విట్టర్‌. తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చింది. యూజర్స్‌ క్రమంగా పెరిగారు. దీంతో ఇ్వట్టర్‌కు భారీగా ఆదాయం రావడంతో ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ కన్ను ట్విట్టర్‌పై పడింది. సామాజిక మాధ్యమం ఉంటే.. అన్నివిధాలుగా ఉపయోగపడుతుందని భావించాడు. ఈ క్రమంలో మొదట భాగస్వామిగా చేరిన మస్క్‌.. తర్వాత దానిని టేకోవర్‌ చేశాడు. తర్వాత ఉద్యోగులను తొలగించారు. కొంతమంది మస్క్‌ కింద పని చేయడం ఇష్టం లేక వెళ్లిపోయారు. తర్వాత ఏడాదిపాటు అనేక మార్పులు చేశాడు మస్క్‌. ట్విట్టర్‌లోని పిట్ట లోగోను ఎగుర గొట్టారు. తర్వాత ట్విట్టర్‌ పేరు మార్చేశారు. ఎక్స్‌గా నామకరణం చేశాడు. తర్వాత బ్లూటిక్‌ విషయంలో అనేక గజిబిజి నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత యూట్యూబ్‌కు దీటుగా ఎక్స్‌ వీడియో ఛానెల్‌ ప్రారంభించారు. అయితే ఎక్స్‌ మస్క్‌ చేతిలోకి వెళ్లాక నష్టాలు మొదలయ్యాయి. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు లాభాల బాట పట్టించేందుకు అనేక చర్యలు తీసుకున్నా ఎలాంటి మార్పు రాలేదు.

రెండేళ్లలో రెండు లక్షల కోట్ల నష్టం..
ఇదిలా ఉంటే ఎక్స్‌(ట్విటర్‌) విలువ గడిచిన రెండేళ్లలో దాదాపు 72 శాతం తగ్గిపోయినట్లు ’న్యూయార్క్‌ పోస్ట్‌’ ఇటీవలే నివేదించింది. ఎలాన్‌మస్క్‌ 2022లో ఎక్స్‌లో అధిక వాటా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్ల గ్రూప్‌నకు సుమారు 24 బిలియన్‌ డాలర్ల(రూ.2 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఎక్స్‌లో 8 మంది ఇన్వెస్టర్ల ఆదాయం గడిచిన రెండేళ్లలో 5 బిలియన్‌ డాలర్లు(రూ.41 వేల కోట్లు) తగ్గిపోయింది.

తగ్గుతున్న ప్రకటనల ఆదాయం..
ఎక్స్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కొంతకాలంగా తగ్గుతోంది. సబ్‌ స్క్రిప్షన్‌ సర్వీస్‌ ఛార్జీలు విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈప్లాన్లపై ఆసక్తి చూపించడం లేదు. ఎక్స్‌ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లేఆఫ్స్‌ ఇస్తుండడంతో నిర్వహణలో మార్పులు వస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. పలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్కు సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇక మూసివేత ఆలోచన..
ఇదిలా ఉంటే.. ఎక్స్‌ను మూసివేయాలన్న ఆలోచనలో మస్క్‌తోపాటు పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దేశాలు ఎక్స్‌ను నిషేధించాయి. రాబోయే రోజుల్లో మరి కొన్ని దేశాలు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉంది. మరోవైపు ఎక్స్‌ అధినేత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ప్రకటించింది. 90 శాతం మీడియా, సోషల్‌ మీడియా కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతుంటే.. ఎక్స్‌ మాత్రమే ట్రంప్‌కు మద్దతు ఇస్తోంది. ట్రంప్‌ గెలిస్తే.. మంత్రి పదవి ఇస్తానని చెప్పడంతో మస్క్‌ మంత్రి కావాలన్న ఆశతో మద్దతు ఇస్తున్నారు. అయితే.. నష్టాల నేపథ్యంలో ఎక్స్‌ను ఎన్నికల తర్వాత మూసివేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మస్క్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాలో తెలియదు.

ఓడితే నిషేధమే..
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోతే.. కమలా ఎక్స్‌ను నిషేధించే అవకాశం ఉంది. ఈ భయం కూడా మస్క్‌ను వెంటాడుతోంది. ఎన్నికల్లో ఎక్స్‌ కమలా హారిస్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు. ట్రంప్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దీంతో ట్రంప్‌పై కోపంతో ఎక్స్‌ను కమలా నిషేధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే నిషేధం కన్నా ముందే.. స్వచ్ఛందంగా మూసివేసే ఆలోచనలో ట్రంప్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏమౌతుందో చూడాలి.