Viral video : క్రికెట్ ఆడుతున్నప్పుడు బౌలర్లు తమ తప్పిదాల వల్ల నోబాల్స్ వేయడం సర్వసాధారణం. మారిన నిబంధనల వల్ల నో బాల్ ఎదుర్కొన్న బ్యాటర్ కు ఫ్రీ హిట్ లభిస్తుంది. అలాంటప్పుడు బ్యాటర్లు పండగ చేసుకుంటారు. నో బాల్ వల్ల బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు అదనంగా ఒక పరుగు కలుస్తుంది. వర్తమాన క్రికెట్ లో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ ను సరిచూసుకొని బంతులు వేస్తుంటారు. ఎందుకంటే నో బాల్స్ వేస్తే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోతుంది. జయాపజయాలను నో బాల్ కూడా నిర్దేశిస్తుంది కాబట్టి.. బౌలర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బౌలింగ్ చేస్తుంటారు.
నో బాల్ అనేది బౌలర్ల తప్పిదం వల్ల చోటు చేసుకుంటుంది. కానీ ఇటీవల జరిగిన ఒక మ్యాచ్లో వికెట్ కీపర్ చేసిన తప్పు వల్ల ఓ బౌలర్ వేసిన బంతి నో బాల్ గా మారింది. బౌలర్ ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ అంపైర్ ఆ బంతిని నో బాల్ గా వెల్లడించడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం వైటాలిటీ టి20 లాస్ట్ టోర్నీ జరుగుతోంది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. సోమర్ సెట్, నార్తంప్టన్ షైర్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా బౌలర్ వేసిన ఓ బంతిని అందుకున్న కీపర్ స్టంప్ లను నేలకూల్చాడు. ఫీల్డ్ అంపైర్ వెంటనే రిప్లై కోసం సంకేతాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా వికెట్ కీపర్ చేసిన తప్పు వెలుగులోకి వచ్చింది..ఆ అప్పీల్ స్టంప్ అవుట్ కాకపోగా.. నో బాల్ గా అంపైర్ ప్రకటించాడు.
బౌలర్ తప్పు చేయకపోయినప్పటికీ..
బౌలర్ ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ.. వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ కంటే ముందు ఉన్నాయి. దీంతో థర్డ్ అంపైర్ ఆ బంతిని నో బాల్ అని ప్రకటించాడు. వికెట్ కీపర్ చేసిన ఆ తప్పు వల్ల బంతి నో బాల్ అయింది. బ్యాటర్ కు తర్వాతి బంతి ఫ్రీ హిట్ గా లభించింది. బ్యాటర్ ఫ్రీ హిట్ గా లభించిన ఆ బంతిని భారీ సిక్సర్ కొట్టాడు. క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్ చేసిన తప్ప వల్ల నోబాల్స్ అవడం అత్యంత అరుదు. ఇక ఈ టోర్నీలో శుక్రవారంతో క్వార్టర్ ఫైనల్స్ పోటీలు ముగిసాయి.. సర్రే, సోమర్ సెట్, గ్లో సెస్టర్ షైర్, ససెక్స్ జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. అదేరోజు ఫైనల్ కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
విస్తృతంగా కౌంటి పోటీలు
ఇంగ్లాండ్ దేశంలో కౌంటి క్రికెట్ పోటీలు విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. మనదేశంలో ఐపీఎల్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. అక్కడ పొట్టి ఫార్మాట్ లో టోర్నీలు ఎక్కువగా జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లను కొనుగోలు చేసిన జట్లు.. వారితో పోటీలు నిర్వహిస్తుంటాయి. ప్రైజ్ మనీ కూడా భారీగానే లభిస్తుంది. మనదేశంలో చాలామంది క్రికెటర్లు ఇలా కౌంటి క్రికెట్ పోటీలలో పాల్గొంటున్నారు.
A No Ball in the Vitality Blast because the wicketkeeper's gloves were in front of the stumps. pic.twitter.com/bYvAtQ2pQv
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More