Package Food: కోటి విద్యుతలు కూటి కోసమే అన్నారు పెద్దలు.. ఒకప్పుడు ఆహారం స్వయంగా పండించుకునేవారు. పండిన పంటను కూడా స్వయంగా ప్రాసెస్ చేసుకునేవారు. తర్వాత వ్యవసాయం తగ్గింది. ప్రాసెసింగ్ కూడా తగ్గింది. ప్రాసెసింగ్ కోసం యూనిట్లు వచ్చాయి. ఇక తర్వాత ఖర్చులు పెరగడంతో అందరూ సంపాదనపై దృష్టిపెట్టారు. దీంతో ఆహరం తయారు చేసుకోవడం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఆహారం కన్నా బయటి నుంచి తెచ్చుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రాసెస్‌డ్ ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పడు అన్నీ రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. ఒకప్పుడు దోశ చేసుకోవాలంటే పిండి రుబ్బాల్సి వచ్చేది. తర్వాత మిక్సీలు వచ్చాయి. ఇప్పుడు రెడీ మిక్స్‌లు వాచ్చాయి. ఇక గతంలో చపాతీ చేసుకోవడానికి గోధుమలను మర ఆడించి పిండిగా మార్చి.. దానిని ముద్దగా చేసి చెపాతీలు చేసేవారు. ఇప్పుడు ప్యాకేజŒ డ్ చెపాతీలు దొరుకుతున్నాయి. తెచ్చుకుని పెనం మీద వేసుకుని కాల్చుకోవడమే. ఇలా ప్రాసెస్‌డ్, ప్యాకేజీ ఫుడ్‌గు డిమాండ్ పెరుగుతోంది.
తగ్గుతున్న ఖర్చు..
ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా కుటుంబాలు ఆహారంపై సగటున చేసే వ్యయాలు 1947 నాటితో పోలిస్తే తొలిసారిగా సగానికి పైగా తగ్గినట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఒక వర్కింగ్ పేపర్లో వెల్లడించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు నెలవారీగా చేసే మొత్తం వ్యయాల్లో ఆహారానికి వెచ్చించేది భారీగా తగ్గింది. అట్టడుగున ఉండే 20 శాతం మంది విషయంలో ఇది మరింత గణనీయంగా ఉంది. వివిధ వర్గాల్లో తృణధాన్యాల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి తగు సాగు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించింది. 2011–12 నాటి వినియోగ ధోరణులను 2022–23తో పోలుస్తూ ఈ పేపర్ సమగ్రంగా విశ్లేషించింది.
వేగంగా వృద్ధి..
ప్రపంచ ఆహార ప్యాకేజింగ్ డిమాండ్ గణనీయమైన వేగంతో పెరుగుతుంది. ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ కారణంగా సంపన్న కుటుంబాలతోపాటు మధ్య తరగతి ప్రజలు కూడా రెడీమేడ్ కూడా రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి, టైం లేకపోవడం, జర్నీకి ఎక్కువగా సమయా కేటాయించాల్సి రావడం వంటి కారణాలతో కూడా చాలా మంది రెడీమేడ్ ఫుడ్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్నిరకాల వంటకాలు కూడా ఇప్పుడు రెడీమేడ్‌గా దొరకుతున్నాయి. ఒకప్పుడు పండుగల వచ్చాయంటే.. అందరూ కలిసి పిండి వంటలు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు అలాంటి దృశ్యాలు తగ్గిపోతున్నాయి. రెడీగా మార్కెట్‌లో దొరికే పిండి వంటలను కొనుగోలు చేసి పండుగలు జరుపుకుంటున్నారు. వాస్తవంగా ఇంట్లో చేసుకునే వంటకాలే ఆరోగ్యానికి మేలు. రెడీమేడ్ పుడ్ ఎలా తయారు చేస్తారో, ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు. అయినా చాలా మంది ఇప్పుడు ప్యాకేజీ ఫుడ్‌కే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు..
ఇక ప్యాకేజ్ ఫుడ్‌లో చాలా వరకు నాసిరకం పదార్థాలే వాడుతున్నారు. మధ్య తరగతి వారు ధరలు ఎక్కువగా ఉంటే కొనడానికి ఇష్టపడరు. దీంతో అన్నివర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ప్యాజీ ఫుడ్ ఇండస్ట్రీవారు. తక్కువ ధరకు లభించే పదార్థాలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఇక వాటిని ఆకర్షణీయంగా కనిపించేలా కలర్స్, పాడవకుండా ఉండడానికి కెమికల్స్ వాడుతున్నారు. ఇలాంటి ఆహారంతో రోగాలు పెరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి కూడా అందరూ రెడీమేడ్ పుడ్‌కే ఆసక్తి చూపుతున్నారు. అనారోగ్యానిక కొని తెచ్చుకుంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: That is why package food is rising there is a huge demand for ready made food
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com