Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ తరహాలో అమెరికాకు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈమేరకు చట్ట సభల సభ్యులకు వెల్లడించారు. త్వరలోనే అందుకు సంబంధించిన ఆదేశాలపై సంతకం చేస్తారని తెలుస్తోంది. అమెరికాకు రక్షణ కవచం అత్యవసరమని, ఐరన్ డోమ్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. దేశ గగనతంలోకి దూసుకువచ్చే క్షిపణులను ఐరన్ డోమ్ వ్యవస్థ కూల్చేస్తుంది. ఇజ్రాయెల్‌పై జరిగే రాకెట్ దాడులను ఐరన్ డోమ్ అడ్డుకుంటుంది. అదే తరహాలో అమెరికాకు ఓ ఐరన్ డోమ్ నిర్మించుకుంటామని ట్రంప్ తెలిపారు. రక్షణ కార్యదర్శిగా పీట్ హేగ్స్‌త్ బాధ్యతలు తీసుకున కార్యక్రమం మియామీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్.. ఐరన్ డోమ్ అత్యవసరంగా నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
ఇజ్రాయెల్ నుంచి నేర్చుకుని…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్‌పై స్ఫూర్తి పొందారు. ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే ముందు గుర్తొచ్చేది దున్భేధ్యమైన ఐరన్ డోమ్. నిప్పుల వర్షంలా ప్రత్యర్థుల రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకుంటుంది. ఆకాశంలో క్షిపిణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ వాసులు ధైర్యంగా తమ పని తాము చేసుకునేలా చేసింది. 2006లో హెజ్‌బొల్లా–ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ జరిగింది. నాడు వేల రాకెట్లు ఆ సంస్థ టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీ ప్రారంభించింది. 2008 నాటికి టమీర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో చివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. హమాస్, హెజ్‌బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చివేయడంతో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
90 శాతం సక్సెస్ రేటు..
ఇక ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు 90 శాతం సక్సెస్ రేటు ఉంది. 2024, అక్టోబర్ 7న హమాస్ దాడిలో వేల రాకెట్లను ఇది కూల్చింది. కొన్ని తప్పించుకుని ప్రజల మరణాలకు కారణమయ్యా. ఇక డోమ్‌కు క్షిపణులను అడ్డుకోవడానికి 50 డాలర్లు ఖర్చవుతుందని సమాచారం. దూసుకువచ్చే ఒక్కో ముప్పును రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఇలాంటివి ఇజ్రాయెల్ వద్ద ప్రస్తుతం పది ఉన్నట్లు సమాచారం. దీనిని వేగంగా ఒక చోటు నుంచి ఒక చోటుకు కూడా తరలించవచ్చు. ఇక ఇజ్రాయెల్2020లో అమెరికాకు రెండ బ్యాటరీలను కూడా ఎగుమతి చేసింది.
ఐరన్ డోమ్ ఎలా పని చేస్తుందంటే..
ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిస్పాట్ బర్జెల్ అంటారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకుంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకువస్తున్న ముప్పుడు గుర్తిస్తుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనా వేస్తుంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. జనావాసాలు ఉంటే మాత్రం రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఐరన్ డోమ్ తయారీకి ఇజ్రాయెల్‌కు ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు సాయం చేశాయి. ప్రతీ ఐరన్ డోమ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి పది సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొంటుంది.