Sankranti Aaynaam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ సినిమా అప్పుడే రెండు వారాల థియేట్రికల్ రన్ లో పూర్తి చేసుకుంది. ఈ రెండు వారాల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నిర్మాతలు పోస్టర్స్ ద్వారా ఈ చిత్రానికి 280 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలిపారు. కానీ ట్రేడ్ పండితులు అందించే సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 245 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఇదే సంక్రాంతికి విడుదలై నైజాం ప్రాంతం లో 38 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రెండు వారాల్లో దానికి సమానంగా వసూళ్లను రాబట్టింది. ఈ వారం తో ‘వాల్తేరు వీరయ్య’ క్లోజింగ్ వసూళ్లను కూడా దాటి, 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. అదే విధంగా సీడెడ్ లో 16 కోట్ల 70 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర లో 19 కోట్ల 50 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 12 కోట్ల 78 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల 82 లక్షలు, కృష్ణ జిల్లాలో 8 కోట్ల 92 లక్షలు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 25 లక్షల రూపాయలను రాబట్టింది.
అదే విధంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను అతి చేరువలో ఉంది. ఇండియన్ కరెన్సీ లెక్కల్లోకి చూస్తే ఇప్పటి వరకు ఓవర్సీస్ మొత్తం కలిపి ఈ చిత్రానికి 15 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలిపి 7 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ గా 141 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 245 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా 160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.